Gopichand : కొన్ని కాంబినేషన్లు.. కొన్ని సినిమాలు.. కుదిరినట్టే కుదిరి ఏవో కారణాల వల్ల క్యాన్సిల్ అవుతుంటాయి. ఒక హీరో కోసం అనుకున్న కథని మరో హీరోతో చేయడం అన్నది సర్వసాధారణం. ఇలాగే ఒక సూపర్ హిట్ సినిమాను ఎన్టీఆర్ వద్దనుకోగా దాన్ని మాచో స్టార్ గోపీచంద్ చేసి హిట్ కొట్టాడు. తారక్ చేయాల్సిన సినిమాను గోపీచంద్ చేశాడా.. ఏంటది.. అంటే.. అమ్మా రాజశేఖర్ డైరక్షన్ లో వచ్చిన రణం అని తెలిసింది. కొరియోగ్రాఫర్ గా కెరియర్ మొదలు పెట్టి డైరక్టర్, యాక్టర్ గా మారిన అమ్మా రాజశేఖర్ బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా సందడి చేశాడు.
అమ్మా రాజశేఖర్ డైరక్షన్ లో వచ్చిన రణం సినిమా గోపీచంద్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కథను అమ్మా రాజశేఖర్ ముందు ఎన్టీఆర్ కి వినిపించారట. అప్పటికే స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న అమ్మా రాజశేఖర్ ఎన్టీఆర్ కి కథ చెప్పగా కథ బాగుంది కానీ ఒక సీన్ లో హీరో విలన్ ముందు చేతులు కట్టుకుని నిలబడతాడు. ఆ సీన్ కు ఎన్టీఆర్ అభ్యంతరం చెప్పడంతో తన సజెషన్ తోనే ఈ కథ గోపీచంద్ కి బాగుంటుందని.. ఆయనికి చెప్పండని.. అన్నాడట. అలా ఎన్టీఆర్ చెప్పడంతో సంతోష్ శ్రీనివాస్ ద్వారా గోపీచంద్ ని కలిసి రణం సినిమా చేశానని అన్నారు అమ్మా రాజశేఖర్.

ఇక మైక్ అందుకుంటే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నారు అమ్మా రాజశేఖర్. బిగ్ బాస్ హౌజ్ లో కూడా తనకి సపోర్ట్ చేసిన వారిని ఒకలా.. సపోర్ట్ చేయని వారిని మరోలా ట్రీట్ చేసిన అమ్మా రాజశేఖర్.. ఈమధ్యనే హీరో నితిన్ మీద వీరంగం ఆడేశాడు. తన సినిమా ఈవెంట్ కి రాలేదని నితిన్ ని డైరెక్ట్ ఎటాక్ చేశారు అమ్మా రాజశేఖర్. సెలబ్రిటీ హోదా వచ్చాక ఒకరిని డైరెక్ట్ గా దూషిస్తున్నాం అంటే కచ్చితంగా రిటర్న్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంచనా వేయాలి. నితిన్ తో ఆగకుండా ఈమధ్య గోపీచంద్ మీద కూడా నెగటివ్ కామెంట్స్ చేశారు అమ్మా రాజశేఖర్. ఇదంతా చూసిన ఆడియెన్స్ ఈయన ఇంతే ఇక మారరని లైట్ తీసుకుంటున్నారు.