Manchu Vishnu : గత కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెర పడింది. ఆదివారం ఉత్కంఠగా పోలింగ్ సాగింది. చిన్న చిన్న ఉద్రిక్త సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. అయితే ఓటు వేయాల్సిన సభ్యులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో పోలింగ్ సమయాన్ని గంట పాటు పెంచారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ జరిగింది. చివరకు ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణుకే అధ్యక్ష పీఠం దక్కింది.
అయితే ముందు నుంచీ చాలా మంది ప్రకాష్ రాజ్ గెలుస్తారని బలంగా నమ్ముతూ వచ్చారు. కానీ చివరకు మంచు విష్ణు గెలవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. ఇక మంచు విష్ణు విజయం వెనుక ఉన్న కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే..
మంచు విష్ణు మొదట్నుంచీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. మా లో ఉన్న ప్రతి సభ్యుడిని కలిసి వారి సమస్యలను విని వాటిని పరిష్కరిస్తామని హామీలు ఇస్తూ ముందుకు సాగారు. ఎన్నికలలో మంచు విష్ణు గెలిచేందుకు ఇది కూడా సహాయ పడింది.
ఇక ఇండస్ట్రీ పెద్దల ఆశీస్సులు తీసుకోవడంలోనూ విష్ణు.. ప్రకాష్ రాజ్ కన్నా ముందే ఉన్నారు. కృష్ణం రాజు, కృష్ణ, కోట శ్రీనివాస రావు, బాలకృష్ణ వంటి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ మాత్రం ఇండస్ట్రీ పెద్దల గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది ఆయనకు మైనస్ అయినట్లు చెప్పవచ్చు.
ఇక మంచు విష్ణు విజయం వెనుక ఉన్న మరో కారణం.. మోహన్ బాబు, నరేష్ అని చెప్పాలి. ఈ ఇద్దరూ ముందు నుంచీ అన్ని వ్యవహారాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. మా సభ్యుల మద్దతు కూడగట్టడంలో వీరిద్దరూ చక్రం తిప్పారు. కనుకనే విష్ణుకు చక్కని మద్దతు లభించింది.
ఇక చివరిగా మంచు విష్ణుకు వైసీపీ మద్దతు, లాబీయింగ్ లభించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత నిజమో తెలియదు కానీ.. ఇటీవలే మంత్రి పేర్ని నాని తమకు, తమ పార్టీకి, మా ఎన్నికలకు సంబంధం లేదని తేల్చేశారు. కానీ ఎంతో కొంత వైసీపీ ప్రభావం ఉండే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఇన్ని కారణాల వల్లే మంచు విష్ణు గెలిచారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు విష్ణు మా అధ్యక్షుడు అయ్యారు కదా.. అందువల్ల ఆయన ముందు నుంచీ చెబుతూ వస్తున్నట్లు.. తన సొంత ఖర్చులతో మా భవనం నిర్మించడంతోపాటు చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారా, లేదా ? అన్నది ఆసక్తికరంగ మారింది. మొత్తానికి కొద్ది రోజుల నుంచీ నెలకొన్న నరాలు తెగే ఉత్కంఠకు శుభం కార్డు పడిందని చెప్పవచ్చు. దీంతో నటీనటులు ఈ రాత్రి నుంచి ప్రశాంతంగా నిద్ర పోతారు. ఓడిపోయిన వారు తప్ప..!
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…