Pragya Jaiswal : మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి ఆ తర్వాత పలు సినిమా ఛాన్స్‌లు అందుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. విరట్టు అనే తమిళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అభిజీత్ నటించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా రోజులకు ‘కంచె’తో రీలాంచ్ అయింది. ఈ సినిమాకు పలు అవార్డ్‌లు రావడంతో ప్రగ్యాకి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఈ అమ్మడు నటించిన ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఫలితంగా టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్‌లను అందుకోలేకపోయింది.
ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. రీసెంట్‌గా బాలయ్యతో కలిసి ప్రగ్యా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఈ అమ్మడు తాజాగా కరోనా బారిన పడింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఈ అమ్మడు కరోనా బారిన పడడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ప్రగ్యా జైస్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రగ్యా జైస్వాల్ ఫాలోవర్లను భారీ స్థాయిలో పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ఒక్కోసారి పిక్స్ కూడా షేర్ చేస్తూ హీటెక్కిస్తుంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…