Chiranjeevi : గత కొద్ది రోజులుగా తారా స్థాయిలో జరిగిన మా ఎన్నికల ప్రచారానికి తెర పడి ఆదివారం ఎన్నికలు కూడా జరిగాయి. సాయంత్రం ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. పదవులు శాశ్వతం కాదని, తాత్కాలికమైన, చిన్న చిన్న పదవుల కోసం ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం సరికాదని అన్నారు. అందరూ ఇండస్ట్రీ అభివృద్దికి కృషి చేయాలన్నారు. ఇంత చిన్న ఎన్నికలకు ఇంత హైప్ అవసరం లేదన్నారు. ఇందుకు గాను మనలో మనం గొడవపడడం బాగాలేదన్నారు. అందరూ కలసి కట్టుగా ఉండాలన్నారు.
కాగా గత కొద్ది రోజుల నుంచి మా ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌తో కలిసి మంచు ప్యానెల్‌పై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఆ ప్యానెల్‌లో కేవలం నాగబాబు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ కు దూరమైందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విడుదల అయిన ఫలితాలను చూస్తే మంచు విష్ణుకు భారీ మెజారిటీ వచ్చింది కనుక ఇవి ఏకపక్ష ఎన్నికలేనని భావించవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…