Naga Chaithanya : సమంత, నాగచైతన్య విడిపోతారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను వారు నిజం చేశారు. తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో విడాకుల అనంతరం ఇద్దరూ తీవ్రమైన బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. సమంత ఓ వైపు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగమైన పోస్టులను పెడుతుంటే.. మరోవైపు నాగచైతన్య వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. ముభావంగా కనిపిస్తున్నారు.
అయితే ఈ ఇద్దరూ విడిపోకముందు నెల రోజుల ముందు నుంచే విడిగా ఉంటున్నారు. అప్పుడే అందరికీ డౌట్ వచ్చింది. కానీ విడాకులు తీసుకున్నాక ఆ అనుమానమే నిజం అయింది. ఇక వివాహం అయ్యాక ఇద్దరూ కలిసి గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అది సమంతదే. దీంతో చైతూ జూబ్లీహిల్స్‌లో భారీ ఖర్చుతో ఓ బంగ్లా కొన్నారు. దాని రెనొవేషన్ వర్క్ కూడా ఇంకా జరుగుతోంది. అది పూర్తయ్యేందుకు ఏడాది పడుతుందని తెలుస్తోంది.
ఆ ఇంటి పని పూర్తయ్యాక చైతూ సమంతతో కలిసి అందులోకి మారుదామని అనుకున్నాడు. అప్పటి వరకు సమంతతో ఆమె అపార్ట్‌మెంట్‌లో ఉండవచ్చని వారిద్దరూ కలసి ఉంటున్నారు. అయితే విడిపోవడానికి నెల రోజుల ముందు నుంచి సమంత ఆ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటుండగా.. చైతూ మాత్రం ఓ విలాసవంతమైన హోటల్‌లో ఉంటున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే కొత్త బంగ్లా సిద్ధం కాకుండానే వీరిద్దరూ విడిపోయారు. అయినప్పటికీ చైతూ ఆ బంగ్లా కొన్నాడు కనుక అందులో ఒంటరిగానే ఉండేందుకు సిద్ధమయ్యాడని టాక్. కానీ అది పూర్తయ్యేందుకు ఇంకా సంవత్సరం అయినా పడుతుంది కదా.. అప్పటి వరకు తల్లిదండ్రుల వద్ద ఉండడం ఇష్టం లేని చైతూ నగరంలోనే ఓ పోష్ ఏరియాలో ఇంకో అపార్ట్‌మెంట్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బంగ్లా సిద్ధం అయ్యే వరకు చైతూ ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండనున్నాడని సమాచారం. ఏది ఏమైనా ఈ బ్యూటిఫుల్ కపుల్ విడిపోవడం మాత్రం ఇప్పటికీ ఇంకా చాలా మంది అక్కినేని ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…