Suhani : 2000వ సంవత్సరంలో చిత్రం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు ఉదయ్ కిరణ్. నువ్వు నేను, మనసంతానువ్వే చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకుని యువతలో లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్నాడు. 2001లో ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన మనసంతా నువ్వే సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఉదయ్ కిరణ్ కెరీర్ లో మూడువ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు అందుకున్నాడు.
మనసంతా నువ్వే సినిమాలో కథ పరంగా ఉదయ్ కిరణ్ రీమాసేన్ చిన్నతనం నుంచి ప్రేమించుకుంటారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన విడిపోతారు. ఉదయ్ కిరణ్ మరియు రీమా సేన్ చిన్ననాటి పాత్రలలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. చాలా మంది ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కేవలం ఒకటి రెండు సినిమాలే చేసినా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చైల్డ్ ఆర్టిస్టులలో సుహాని కూడా ఒకరని చెప్పచ్చు.

సుహాని మనసంతా నువ్వే సినిమాలో రీమాసేన్ చిన్ననాటి పాత్రలో నటించడం జరిగింది. తూనీగా తూనీగా అనే పాటలో సుహాని క్యూట్ ఎక్సప్రెషన్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ కూడా బాగా గుర్తుండే ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాల రామాయణం సినిమాతో వెండితెరకు పరిచయమైంది సుహాని. ప్రేమంటే ఇదేరా, గణేష్, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో బాలనటిగా నటించి ప్రేక్షకులను అలరించింది.
20 ఏళ్లు దాటిన తరువాత సుహానీ హీరోయిన్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 2008 లో సవాల్ సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయింది. ఆ తవరాత సుహానీ స్నేహగీతం సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సుహాని నటించిన చిత్రాలు సక్సెస్ కాకపోవడంతో వెండి తెరకు దూరం అయింది. తాజాగా సుహాని ప్రముఖ సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజా ని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.