Anchor Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మీ గౌతమ్. చాలాకాలంగా ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి సైతం హోస్ట్ గా చేస్తుంది. చూడ చక్కని రూపంతో పాటు అదిరిపోయే హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ భామ.. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలాకాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనేక చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. అయితే ఒకప్పుడు యాంకర్ రష్మీ బుల్లితెరపై ఫుల్ ట్రోలింగ్‌కు గురయ్యేది.
ఆమె భాష, వస్త్రాధారణ ఇలా అన్నింటి మీద నెగెటివ్ కామెంట్స్ వచ్చేవి. కానీ క్రమేనాణా రష్మీ డెడికేషన్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఆమె మంచితనం, సేవా కార్యక్రమాలు, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఆమెకు మంచి ఇమేజ్‌ను కట్టబెట్టాయి. సోషల్ మీడియాలో రష్మీ చేసే పోస్టులకు విపరీతమైన స్పందన వస్తుంది. అయితే రష్మీ ఈ మధ్య ఎక్స్‌పోజింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకప్పుడు అయితే డబ్బు కోసం ఎలాంటి పాత్రలు వచ్చినా చేసింది.

డబ్బు అవసరం అని, డబ్బు కోసమే అలాంటి పాత్రలు చేశానంటూ అందరి ముందే ఒప్పేసుకుంది రష్మీ. ఆలీతో సరదాగా షోలో మాట్లాడుతూ ఈ విషయాల మీద స్పందించింది. బుల్లితెరపై వచ్చే షోల్లోనూ ఒకప్పుడు రష్మీ తన అందాలను ప్రదర్శించేది. కానీ కొన్ని రోజులుగా వాటికి దూరంగా ఉంటూ వచ్చింది రష్మీ. కానీ తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో మాత్రం రష్మీ మళ్లీ అందరినీ ఆశ్చర్యపరిచింది. మోకాళ్ల పైకి గౌను ధరించింది. పొట్టి గౌనులో రష్మీ చాలారోజుల తరువాత కనిపించేసరికి అందరూ అవాక్కవుతున్నారు.