Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మహిళ గొంతు కోసి పరారయ్యాడు. స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. అయితే ఆ మహిళ చనిపోగా.. సదరు నిందితుడికి ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్సను అందిస్తున్నారు. పోలీసులు ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలోని ద్వారక అనే ప్రాంతంలో విభ (30) అనే మహిళ తన భర్తతో కలసి నివసిస్తోంది. ఈ జంట కూరగాయల షాప్‌ను నిర్వహిస్తున్నారు. అయితే దీపక్ అనే వ్యక్తి ఇటీవల వారి షాప్‌కు పీకలదాకా మద్యం సేవించి వచ్చాడు. దీంతో అతనికి, ఆ జంటకు గొడవ అయింది. అయితే ఇది మనస్సులో పెట్టుకున్న దీపక్ విభను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
అందులో భాగంగానే అతను ఆదివారం రాత్రి ఆ మహిళ రోడ్డుపై మార్కెట్‌లో నడిచి వస్తుండగా.. నెమ్మదిగా వచ్చి ఆమె గొంతు కోశాడు. తనతోపాటు సంచిలో తెచ్చుకున్న ఓ పదునైన వస్తువుతో ఆమెపై దాడి చేశాడు. అయితే స్థానికులు ఇది గమనించి వెంటనే అతన్ని పట్టుకుని చితకబాదారు. పోలీసులు రావడంతో వారు నిందితున్ని అరెస్టు చేశారు.
విభను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కాగా నిందితుడిని స్థానికులు కొట్టడం వల్ల అతనికి గాయాలు అయ్యాయని, అందువల్ల అతనికి చికిత్స కొనసాగుతుందని, అతను డిశ్చార్చి కాగానే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…