Facebook : సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 3 గంటల వరకు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు పనిచేయలేదు. ఈ నెట్‌వర్క్‌లకు చెందిన సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చాలా మంది తమ ఇంటర్నెట్ పనిచేయడం లేదు కావచ్చని అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
అయితే రోజూ చాలా మంది ఈ మూడు నెట్‌వర్క్‌లకు చెందిన సేవలను విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. మీడియా కూడా ఎక్కువగా వీటిని వాడుతుంది. అందులోనూ రాత్రి సమయం కనుక వీటి సేవలు ఆగిపోవడంతో చాలా మందికి సమస్యగా మారింది. మళ్లీ ఎప్పుడు అవి పనిచేస్తాయోనని ఆందోళన చెందారు. అయితే ఎట్టకేలకు సేవలను పునరుద్ధరించారు.
ఇక 6 గంటల పాటు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల సేవలు నిలిచిపోయినందున ఫేస్‌బుక్‌కు దాదాపుగా 600 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగింది. ఇక ఫేస్‌బుక్ స్టాక్ 4.9 శాతం తగ్గింది. మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత సంపద 6 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది. స్టాక్ స్లయిడ్ లో జుకర్ బర్గ్ ఆస్తి విలువ 121.6 బిలియన్ డాలర్లకు పడిపోగా.. ఆయన సంపన్నుల జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…