Facebook : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్, వాటి మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌లు కొన్ని గంటల పాటు పనిచేయలేదు. ఆయా సోషల్ నెట్‌వర్క్‌ల సేవలు నిలిచిపోయాయి. భారత కాలమానం ప్రకారం 04వ తేదీ అక్టోబర్ 2021 రాత్రి 9.09 గంటలకు వీటి సేవలు నిలిచిపోగా.. 05వ తేదీ అక్టోబర్ 2021 ఉదయం 3 గంటలకు సేవలను పునరుద్దరించారు. అంటే మొత్తం 6 గంటల పాటు ఈ సంస్థల సేవలు నిలిచిపోయాయి.
ఇంత భారీ ఎత్తున ఫేస్‌బుక్‌కు చెందిన సేవలు నిలిచిపోవడం ఇది రెండోసారి అని చెప్పవచ్చు. గతంలో.. అంటే.. 2019లోనూ ఇలాగే జరిగింది. అప్పట్లో ఫేస్‌బుక్ సేవలు ఏకంగా 24 గంటల పాటు నిలిచిపోయాయి. అయితే దీనికి కారణం సాంకేతిక సమస్యే అని, వాట్సాప్‌పై సైబర్ అటాక్ దాడి జరిగినందుకు కాదని.. ఫేస్‌బుక్ తెలియజేసింది.
తమ డీఎన్ఎస్ సర్వర్లలో సమాచారం ఏమీ లేదని, దీంతో యూజర్లు ఫేస్‌బుక్‌ను యాక్సెస్ చేసినప్పుడు అది రాలేదని, అందుకనే మూడు నెట్‌వర్క్‌లు పనిచేయలేదని ఫేస్‌బుక్ తెలిపింది. డీఎన్ఎస్ సర్వర్ల కాన్ఫిగరేషన్‌లో తలెత్తిన సమస్య వల్లే ఈ విధంగా సేవలకు అంతరాయం ఏర్పడిందని.. ఫేస్‌బుక్ స్పష్టం చేసింది.
అయితే మరో వైపు యూజర్లు మాత్రం ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లపై ట్రోల్స్, మీమ్స్ చేసి వదిలారు. దీంతో అవి వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…