Bank Fraud : మొబైల్ ఫోన్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ వ్యక్తికి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. తన స్నేహితుని కార్‌లో తన ఫోన్, కార్డులను పెట్టి వేరే చోటకు వెళ్లాడు. దీంతో ఫోన్, పర్సును ఎవరో కొట్టేశారు. తరువాత అతని బ్యాంక్ అకౌంట్‌లో రూ.9.50 లక్షలను కాజేశారు. చివరకు బ్యాంకు మాత్రం ఆ డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని విక్రోలి అనే ప్రాంతానికి చెందిన ఏరత్ అనే 51 ఏళ్ల వ్యక్తి ఓ కన్సల్టింగ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. కాగా ఇతను ఆగస్టు 22వ తేదీన అక్కడి ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాంతంలో తన స్నేహితులను కలిసేందుకు వెళ్లాడు. అక్కడ ఓ స్నేహితుని కార్‌లో తన ఫోన్, పర్సును పెట్టి వేరే దగ్గరకు వెళ్లాడు. తరువాత వచ్చి చూడా ఫోన్, పర్సు పోయినట్లు గుర్తించాడు. పర్సులో అతని డెబిట్, క్రెడిట్ కార్డులు అన్నీ ఉన్నాయి.
అయితే ఉదయం 7.30 గంటలకు అతను తిరిగి వచ్చాక చూసి అవి పోయినట్లు గుర్తించాడు. కానీ ఫిర్యాదు మాత్రం వెంటనే చేయలేదు. ఇదే అతని కొంప ముంచింది. మధ్యాహ్నం 1 గంటకు బ్యాంకు సిబ్బందికి కాల్ చేసి అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించాడు. కార్డులను బ్లాక్ చేయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. అతని ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్‌లో ఉన్న రూ.9.50 లక్షలను కాజేశారు.
ఒక్క వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడ్డినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. కానీ అతను మాస్క్ పెట్టుకుని ఉన్నాడని, అందువల్ల అతన్ని సరిగ్గా గుర్తించలేకపోతున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘటన జరిగిన తరువాత ఏరత్ తన డబ్బును రీఫండ్ చేయాలని బ్యాంకుకు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. కానీ బ్యాంకు వారు అందుకు నిరాకరించారు.
తాము ఏరత్‌కు చెందిన అకౌంట్ నుంచి నగదు విత్‌డ్రా అవుతున్నప్పుడు అతని ఫోన్ కాల్ చేసి వెరిఫై చేశామని, అవతలి నుంచి తానే చేస్తున్నట్లు చెప్పాడని, అందువల్ల ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని బ్యాంకు వారు తేల్చేశారు. కానీ నిజానికి అతని ఫోన్ కూడా పోయింది. అవతలి వ్యక్తి ఏరత్ కాదు. దొంగతనం చేసిన వ్యక్తి. కనుక బ్యాంకు వారు కాల్ చేసినా అతనే లిఫ్ట్ చేశాడు కాబట్టి తానే ఏరత్ అని కన్‌ఫాం చేశాడు. దీంతో బ్యాంకు వారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అలా అతని నిర్లక్ష్యం కారణంగా రూ.9.50 లక్షలను పోగొట్టుకున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…