Pawan Posani : ప్రజా స్వామ్యంలో ఎవరికైనా సరే వాక్ స్వాతంత్య్రం ఉంటుంది. అంటే.. మాట్లాడే స్వేచ్ఛ అన్నమాట. ఎవరైనా సరే తమ అభిప్రాయాలను ఏ వేదికపై అయినా సరే పంచుకోవచ్చు. అయితే తమ అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బ తీయకూడదు. అది ప్రాథమిక సూత్రం. ఎవరైనా సరే తమకు అన్యాయం జరుగుతుందని, తమపై దాడి జరుగుతుందని, తమను చంపబోతున్నారని భావిస్తే అందుకు చట్టాలు, న్యాయవ్యవస్థ ఉన్నాయి. ఆ విధంగా పోరాటం చేయాలి. కానీ వాక్ స్వాతంత్య్రం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడితే కుదరదు.
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న సంఘటనల్లోనూ కొందరు హద్దులు మీరి మాట్లాడారు. అది వాస్తవమే. వారిలో ఉన్న ఆగ్రహావేశాలు కావచ్చు, మరో విషయం కావచ్చు. కానీ వాక్ స్వాతంత్య్రం సేరిట ఎవరి మనోభావాలను దెబ్బ తీయరాదు. ఎవరి ప్రతిష్టకూ భంగం కలిగించరాదు. తమకు అన్యాయం జరిగిందని అనిపిస్తే పోలీస్ స్టేషన్ లో కేసు వేసి లేదా కోర్టులో పిటిషన్ వేసి తేల్చుకోవచ్చు. అంతేకానీ.. తిట్ల దండకం కూడదు. అది సెలబ్రిటీలకే కాదు, ఎవరికైనా సరే మంచిది కాదు.
అయితే పవన్ వర్సెస్ వైసీపీగా ఉన్న కోల్డ్ వార్, పవన్ వర్సెస్ పోసానిగా మారింది. తనకు ఎంతో ఇష్టమైన మంత్రి పేర్ని నానిని పవన్ సన్నాసి అనడం నచ్చలేదని చెప్పి పోసాని ఇష్టం వచ్చినట్లు పవన్‌ను తిట్టారు. అయితే విమర్శల వరకు ఓకే. కానీ పోసాని అలాంటి భాషను మాట్లాడడం తగదని సాక్షాత్తూ వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. మంత్రి పేర్నినాని పవన్ తిట్టారని అనుకుంటే.. పోసాని రివర్స్‌లో పవన్‌ను తిట్టడం ఎందుకన్నది ప్రశ్న. పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అంతేకానీ.. వివాదంలో లేని కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగి మరీ తిట్టడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు.
ఇక పవన్ తనకు రాజకీయ పరంగా వైసీపీ శత్రువే అయినా ఆయన ఏపీ ప్రభుత్వంతో డైరెక్ట్ గా పోరాటం చేయాలని, హైదరాబాద్‌లో ఉండి, అదీ.. ఒక సినిమా వేడుక వేదికపై రాజకీయాలతో ముడిపడి ఉండే వ్యాఖ్యలు చేయడం ఏమిటని.. విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పవన్ నిజానికి పోసానిలా బూతులు మాట్లాడలేదు. కానీ రెండో సారి మంగళగిరిలో మాత్రం దాదాపుగా ఆ విధంగానే మాట్లాడారు. అయితే ఎవరైనా సరే తన ప్రతిష్టకు, పరువుకు భంగం కలిగిందని భావిస్తే కోర్టులో కేసు వేయవచ్చు. ఆ విధంగా చట్ట బద్ధంగా ముందుకు సాగితే హుందాగా ఉంటుంది. పోసాని అయినా పవన్ అయినా.. ఆ విధంగా పోరాటం చేయవచ్చు. కానీ పోసాని తను అన్నాడని పవన్, పవన్ తనను అన్నారని పోసాని.. లేదా పవన్ అభిమానులు పోసానిని.. తీవ్ర పదజాలంతో విమర్శించడం హుందాగా ఉండదు.
ఉత్తరాదిలోనూ ఇలాంటి సంఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉంటాయి. నేతలైతే ఇలా ఎదురు దాడి చేసి తీవ్ర పదజాలంతో దూషించరు. కోర్టులలోనే తేల్చుకుంటారు. ఆ విధంగా ముందుకు సాగితే ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఉంటుంది. లేదంటే.. ఎప్పటికీ ఇలాగే జరుగుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…