Dil Raju : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా మారింది ప్రముఖ నిర్మాత దిల్ రాజు పరిస్థితి. మొన్నా నడుమ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం, మంత్రులపై వ్యాఖ్యలు చేయడం ఏమో గానీ.. అక్కడ వేడుకలో స్టేజీ ఎదురుగా ఉండి నవ్వినందుకు దిల్ రాజు హుటాహుటిన మంత్రి పేర్ని నానిని వెళ్లి కలిశారు. అబ్బే.. పవన్ అలా అన్నారు కానీ.. దానికి మాకు ఏం సంబంధం లేదు, ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని మంత్రి నానికి స్వరం వినిపించారు.
అయితే మంత్రి పేర్ని నానిని కలిసేందుకు వెళ్లిన నిర్మాతలందరితోనూ దిల్ రాజు మళ్లీ పవన్‌ను కలిశారు. దీంతో ఆసక్తికర చర్చ మొదలైంది. దిల్ రాజు నిర్మిస్తున్న పలు సినిమాలు భవిష్యత్తులో విడుదల కానున్నాయి. అవి విడుదల అయ్యే వరకు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేకుండా శాంతియుతంగా ఉండాలని.. ఈ వివాదాలన్నీ సద్దుమణగాలని.. అప్పుడే తనకు గానీ, ఇతర నిర్మాతలకు గానీ ఎలాంటి భయం లేకుండా ఉంటుందని దిల్ రాజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆయన అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు పవన్‌కు మధ్య రాయబారం నడిపిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
పరస్పరం వ్యాఖ్యలు, విమర్శలు చేసుకున్న పవన్, వైసీపీ మంత్రులు బాగానే ఉన్నారు, కానీ దెబ్బ పడేది నిర్మాతలకే. ఇప్పటికే కరోనా వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న చిత్ర పరిశ్రమకు మళ్లీ పూర్వ రోజులు రావాలంటే చాలా కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇలాంటి గడ్డు సమయంలో ఈవిధంగా వివాదాలు వస్తే అవి నిర్మాతలకు ఏమాత్రం మంచివి కావు. కనుకనే దిల్ రాజు నేతృత్వంలో వారందరూ కాళ్లకు బలపాలు కట్టుకుని అటు, ఇటు తిరుగుతున్నారు. మరి దిల్ రాజు రాయబారం ఫలిస్తుందా ? వివాదాలన్నీ సద్దుమణిగిపోతాయా ? అన్నది తెలియాలంటే.. మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…