Mallika Sherawat : బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. హీరోలు తెల్లవారుజామున 3 గంటలకు పిలిచినా వెళ్లాల్సిందేనని.. లేకపోతే సినిమా నుంచి తీసేస్తారని.. సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు గళం విప్పారు. ఇప్పుడు వారి సరసన మల్లికా శెరావత్ చేరింది. ఆమె తాజాగా ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను తెలియజేసింది.
మర్డర్ మూవీ ద్వారా ఫేమస్ అయిన మల్లికా శెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. తరువాత కూడా మల్లికా అలాంటి పాత్రల్లోనే నటించింది. అయితే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దీపికా పదుకొనె ఇటీవల నటించిన గెహ్రాయియా చిత్రాన్ని తానెప్పుడో 15 ఏళ్ల కిందటే చేశానని చెప్పింది.
బాలీవుడ్‌లో ఎ-లిస్టర్ హీరోలు ఏం అడిగినా కాంప్రమైజ్ అవకూడదు. ఒకవేళ కాంప్రమైజ్ కాకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయి. ఇక్కడ మరోలా అంటే.. అర్థం ఏమిటో మీరు ఊహించుకోవచ్చు. అదే కాంప్రమైజ్ అయితే వారి సర్కిల్‌లో ఉంటారు. వారి సినిమాల్లో అవకాశాలు వస్తాయి. వారు నిలబడమన్నా, కూర్చోమన్నా, ఏం చెప్పినా చేయాలి. హీరో తెల్లవారు జామున 3 గంటలకు పిలిచినా సరే వెళ్లాలి. లేదంటే సినిమా నుంచి తీసేస్తారు. తరువాత అవకాశాలు కూడా రావు.. అంటూ మల్లికా సంచలన వ్యాఖ్యలు చేసింది.
కాగా మల్లికా శెరావత్ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన రోల్స్‌లో నటించింది. చాలా వరకు ఈమె చేసినవన్నీ బోల్డ్ పాత్రలే. ఇక ఆమె ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్‌తో ఒక సినిమాలో నటించింది. అలాగే అమెరికా అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాను రెండు సార్లు కలిసే చాన్స్ ను దక్కించుకుంది. అయితే మల్లికా శెరావత్ ఇప్పుడు సంచలన కామెంట్స్ చేయడంతో ఆమె మరోమారు వార్తల్లో నిలిచింది. దీనికి బాలీవుడ్ వర్గాలు ఏమని స్పందిస్తాయో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…