Raghuvaran : తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు రఘువరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దక్షిణాదిలో ఎన్నో భాషలకు చెందిన చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. విలన్ అనే పదం అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే పేర్లలో రఘువరన్ ఒకటి. ఈయన తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషలకు చెందిన చిత్రాల్లో నటించారు. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన సుమారుగా 200కు పైగా మూవీల్లో నటించారు. ఈయన తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉండేవారు. డైలాగ్స్ డెలివరీలోనూ తనదైన స్టైల్ ఈయనకు సొంతం.
రఘువరన్ జన్మించింది కేరళలోని కొల్లెన్ గోడే అనే ప్రాంతంలో. ఈయన 1979 నుంచి యాక్టింగ్ చేయడం మొదలు పెట్టారు. 1996లో ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్టు రోహిణిని వివాహం చేసుకున్నారు. ఇక ఈయన తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించారు. తన సొంత మ్యానరిజాన్ని కలిగి ఉండేవారు. ఈయన తెలుగులో చేసిన శివ ఎంతగానో పేరు తెచ్చి పెట్టింది. ఆర్‌జీవీ ఈయనలోని కొత్త తరహా విలన్‌ను బయటకు తెచ్చారు. అప్పటి నుంచి అదే మ్యానరిజంతో విలన్‌గా రఘువరన్ కొనసాగారు.
తెలుగులో రఘువరన్ శివ, ఆహా, సుస్వాగతం, నాగ, జానీ, నాని, మాస్ వంటి చిత్రాల్లో నటించారు. చివరి సారిగా ఆటాడిస్తా మూవీలో నటించారు. ఇక సుస్వాగతం మూవీలో ఈయన తండ్రి పాత్రలో జీవించారు. కొడుకును అమితంగా ప్రేమించే తండ్రిగా ఈయన అద్భుతంగా నటించారు. అయితే 2004లో రఘువరన్.. రోహిణికి విడాకులు ఇచ్చారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
అయితే రఘువరన్ రోజులో 24 గంటలూ మత్తులో ఉండేవాడని.. డ్రగ్స్‌కు బానిస అయ్యాడని.. కనుకనే రోహిణి ఆయనకు విడాకులు ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయనకు ఎంత చెప్పినా డ్రగ్స్ తీసుకోవడం మానలేదట. దీంతో రోహిణి ఆయనకు విడాకులు ఇచ్చారు. అయితే రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు. ఇక రఘువరన్ అలా డ్రగ్స్‌కు బానిస అయ్యేందుకు ఆయన లవ్ ఫెయిల్యూరే కారణమని తెలుస్తోంది. ఆయన అప్పట్లో నటి అమలను అమితంగా ప్రేమించారట. కానీ ఆమె మాత్రం నో చెప్పిందట. కనుకనే ఆయన తీవ్ర మనస్థాపం చెంది డ్రగ్స్‌కు బానిస అయ్యారు. ఆ తరువాత రోహిణితో వివాహం అయినా.. కుదురుగా ఉండలేదు. కనుకనే వారు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు రఘువరన్ చనిపోయారు. అమల వల్లే ఆయన కెరీర్ అలా నాశనం అయిందని అంటుంటారు. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…