Vijayashanti : బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇందులో నాగచైతన్య కూడా మరో కీలకపాత్రలో నటించాడు. ఈ మూవీ చైతూకు తొలి హిందీ మూవీ. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో నాగార్జున కూడా పాల్గొంటున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ సమర్పిస్తోంది. అల్లు అరవింద్ కాబట్టి దీనికి చిరంజీవి కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యే వీరందరికీ అమీర్‌ఖాన్ ఒక స్పెషల్ షో వేసి చూపించారు. దీంతో చిరంజీవి ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.
అలాగే ఇటీవలే లాల్ సింగ్ చడ్డా తెలుగు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా చిరంజీవి అమీర్‌ఖాన్‌ను ఆకాశానికెత్తేశారు. అమీర్ ఒక గొప్ప నటుడని చిరంజీవి ప్రశంసించారు. అయితే ఈ వ్యాఖ్యలకు నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే.. ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కి జనం అర్థమయ్యేలా చేస్తున్నారు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ.. 2015లో అమీర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారు. భారత్‌లో అసహనం పెరిగిపోయిందని.. ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో అమీర్ అన్నారు.
భారతదేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో.. ఇప్పటికీ పొందుతున్నారో.. చరిత్రను, సమకాలీన పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. మనకి స్వాతంత్ర్యం రావడానికి ముందు, తర్వాత, నేడు.. ఎప్పుడు చూసుకున్నా ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ అమీర్‌తో సహా బాలీవుడ్‌లో సముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్నే చెప్పుకోవచ్చు.
ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నరు. దురదృష్టమేంటంటే.. జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు.. అమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీషోల్లో పాల్గొంటున్నరు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలి.. అంటూ విజయశాంతి వరుస ట్వీట్లు చేశారు. ఇక్కడ వారు.. అంటే అది ఇన్‌డైరెక్ట్‌గా చిరంజీవి అనే అర్థం వస్తుంది. ఎందుకంటే ఆయన, నాగార్జున ఇద్దరూ ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు కదా.. కనుక వారు తమ స్వప్రయోజనాల కోసం ప్రేక్షకులను, ప్రేక్షకుల భావాలను పట్టించుకోవడం లేదని.. అర్థం చేసుకోవచ్చు. ఇలా విజయశాంతి ఇన్‌డైరెక్ట్‌గా చిరంజీవి, నాగార్జునలపై విమర్శలు చేశారు. మరి దీనికి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…