Malaika Aurora : రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ గ‌బ్బ‌ర్ సింగ్ బ్యూటీ.. హెల్త్ కండిష‌న్ ఏంటి..?

Malaika Aurora : బాలీవుడ్‌లో ప్ర‌ముఖ మోడ‌ల్‌గా పేరు తెచ్చుకున్న మ‌లైకా అరోరా నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తుంటుంది. ఆమె స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకొన్ని కొన్నాళ్ల‌కే త‌మ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. కొన్నేళ్ల కాపురం త‌ర్వాత మ‌నస్ప‌ర్ద‌ల‌తో ఇద్ద‌రూ విడిపోయారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్ర‌స్తుతం మ‌లైకా అరోరా.. బోనీ క‌పూర్ కుమారుడు అర్జున్ క‌పూర్‌తో రిలేష‌న్ షిప్‌లో ఉంది. మ‌లైకా తెలుగులో మ‌హేష్ బాబు హీరోగా చేసిన అతిథి సినిమాతోపాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా చేసిన గ‌బ్బ‌ర్ సింగ్‌లోనూ ఐట‌మ్ సాంగ్స్‌తో మెప్పించింది.

Malaika Aurora

సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో సందడి చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మలైకా అరోరా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని వస్తుండగా ఆమెకు యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు అయ్యాయి. శనివారం (ఏప్రిల్ 2) ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. అనంతరం మలైకా స్వల్ప గాయాలతో నవీ ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చేరింది.

నటి సోదరి అమృతా అరోరా స్వయంగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. మలైకా అరోరా పూణెలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆమె నుదుటిపై స్వల్ప గాయాలయ్యాయి. మలైకా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉందని, ఆమెను కొంతకాలం పరిశీలనలో ఉంచుతారని అమృత తెలిపింది. ఆమెను పరామ‌ర్శించ‌డానికి కుటుంబ‌ స‌భ్యులు, ద‌గ్గ‌రి స్నేహితులు వెళ్లారు.

మలైకా కోలుకున్న త‌ర్వాత విచార‌ణ జ‌రిపి ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తామ‌ని పోలీసులు తెలిపారు. మ‌లైకా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆమె అభిమానులు, స‌న్నిహితులు కోరుకుంటున్నారు. మోడలింగ్ రంగంలో సత్తా చాటిన మలైకా అరోరా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, అంతగా పేరు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఛయ్య ఛయ్య.., అనార్కలీ డిస్కో ఛాలీ, మున్నీ బద్నామ్‌.. వంటి ఐటమ్‌ సాంగ్స్‌‌ చేసి గుర్తింపు పొందింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM