Malaika Aurora : బాలీవుడ్‌లో ప్రముఖ మోడల్‌గా పేరు తెచ్చుకున్న మలైకా అరోరా నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తుంటుంది. ఆమె సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకొన్ని కొన్నాళ్లకే తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. కొన్నేళ్ల కాపురం తర్వాత మనస్పర్దలతో ఇద్దరూ విడిపోయారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం మలైకా అరోరా.. బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్‌లో ఉంది. మలైకా తెలుగులో మహేష్ బాబు హీరోగా చేసిన అతిథి సినిమాతోపాటు పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన గబ్బర్ సింగ్‌లోనూ ఐటమ్ సాంగ్స్‌తో మెప్పించింది.

సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో సందడి చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మలైకా అరోరా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని వస్తుండగా ఆమెకు యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు అయ్యాయి. శనివారం (ఏప్రిల్ 2) ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. అనంతరం మలైకా స్వల్ప గాయాలతో నవీ ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చేరింది.
నటి సోదరి అమృతా అరోరా స్వయంగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. మలైకా అరోరా పూణెలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆమె నుదుటిపై స్వల్ప గాయాలయ్యాయి. మలైకా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉందని, ఆమెను కొంతకాలం పరిశీలనలో ఉంచుతారని అమృత తెలిపింది. ఆమెను పరామర్శించడానికి కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితులు వెళ్లారు.
మలైకా కోలుకున్న తర్వాత విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. మలైకా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, సన్నిహితులు కోరుకుంటున్నారు. మోడలింగ్ రంగంలో సత్తా చాటిన మలైకా అరోరా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, అంతగా పేరు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఛయ్య ఛయ్య.., అనార్కలీ డిస్కో ఛాలీ, మున్నీ బద్నామ్.. వంటి ఐటమ్ సాంగ్స్ చేసి గుర్తింపు పొందింది.