Malaika Arora : బాలీవుడ్ నటి మలైకా అరోరా ఎల్లప్పుడూ గ్లామరస్ గా కనిపిస్తుంటుంది. ఈమె సాధారణంగానే అందాలను ఆరబోస్తుంటుంది. ఇక ఫిట్ నెస్ పేరిట ఈమె చేసే యాక్టివిటీలలో అయితే ఈమెను వర్ణించనలవి కాదు. అంతలా అందాల ప్రదర్శన చేస్తుంటుంది. జిమ్, యోగా, రన్నింగ్.. ఇతర వ్యాయామాలు చేస్తూ మలైకా అరోరా తన ఫిట్‌నెస్‌ను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉంటుంది. లేటు వయస్సులోనూ మలైకా అందాలు మతులు పోగొడుతుంటాయి.

మలైకా అరోరా సమయం లభిస్తే చాలు జిమ్ లేదా యోగా చేస్తుంటుంది. తాజాగా ఈమె ట్రెయినర్ సర్వేష్ శషి నిర్వహించిన ఫిట్ నెస్ సెషన్‌లో పాల్గొని యోగా చేసింది. దాని తాలూకు వీడియోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిల్లో మలైకా ఒక రేంజ్‌లో అందాలను ఆరబోసింది.
View this post on Instagram
మలైకా అరోరా రోజూ ఉదయాన్నే తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ కు వెళ్తుంది. అది మొదలు రోజంతా ఆమె ఏదో ఒక ఫిట్ నెస్ యాక్టివిటీ చేస్తూనే ఉంటుంది. అందుకనే ఆమె ఎల్లప్పుడూ ఫిట్ గానే కనిపిస్తుంటుంది.
View this post on Instagram
ఇక ఈమెకు 47 ఏళ్లు కాగా.. ఈమెను చూస్తే అంత వయస్సు ఉన్నదానిలా అనిపించదు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ తనయుడు అర్జున్ కపూర్‌తో ఈమె రిలేషన్ షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె సర్వ యోగా స్టూడియోస్ తో కలిసి యోగా చేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తోంది.