Anasuya Bharadwaj : బుల్లితెర స్టార్ యాంకర్‌గా అనసూయ ప్రస్తుతం దూసుకుపోతోంది. మరోవైపు సినిమాల్లోనూ చురుగ్గా నటిస్తోంది. ఓ వైపు బుల్లితెర, మరోవైపు వెండి తెరపై అనసూయ బిజీగా గడుపుతోంది. అనేక షోలు, ఈవెంట్స్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక ఈమె ఇటీవల నటించిన పుష్ప చిత్రంలో దాక్షాయణిగా కనిపించి అలరించింది. ఆ పాత్రలో అనసూయ సూపర్బ్‌గా యాక్ట్ చేసిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆమె పుష్ప 2 లో మరింత నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది.

అనసూయ పుష్ప మూవీతోపాటు ఖిలాడిలోనూ నటించింది. అందులో ఒక హీరోయిన్‌కు తల్లిగా.. రవితేజకు అత్తగా ఆమె నటించిందని సమాచారం. ఈ వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అనసూయ లాగా బుల్లితెరకు చెందిన ఏ యాంకర్ కూడా సినిమాల్లో ఇంత సక్సెస్ సాధించలేదనే చెప్పాలి. గతంలో ఈమె పలు సినిమాల్లో లీడ్ క్యారెక్టర్లలో నటించింది.
సోషల్ మీడియాలో అనసూయ ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు అందులో తన ఫొటోలను, తాను చేసే పనులను షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఆమె బ్రౌన్ కలర్ డ్రెస్‌లో ఫొటోషూట్ చేసింది. దాని తాలూకు ఫొటోలను షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.
ఆ ఫొటోల్లో అనసూయ ఒక రేంజ్‌లో ఉంది. గ్లామరస్ ఫొటోలను షేర్ చేయడంలోనూ ఆమెకు ఆమెనే సాటి అనిపించుకుంటోంది. ఇక గతంలో జరిగిన మా ఎన్నికల్లో ఆమె ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే రాను రాను ఈ విషయం గురించి అందరూ మర్చిపోయారు.