Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రముఖుల బర్త్ డేలకి శుభాకాంక్షలు అందించడమే కాకుండా, చిన్న, పెద్ద సినిమాలకు రివ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఏ సినిమా రిలీజ్ అయినా అందరి కన్నా ముందే మహేష్ తన స్పందన తెలియజేస్తూ వస్తున్నారు. అయితే కేజీఎఫ్ 2 విషయంలో మహేష్ ఇప్పటి వరకు స్పందించలేదు. కేజీఎఫ్ 2 పై మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా మహేష్‌కి నచ్చకపోవడంతోనే ఆయన ట్వీట్ చేయలేదని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరికొంతమంది మాత్రం సర్కారు వారి పాటతో బిజీగా ఉండడంతో చూసే అవకాశం రాలేదని అంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆర్ఆర్ఆర్, పుష్పతోపాటు పలు చిత్రాల గురించి మహేష్ ట్వీట్ చేశారు. కేజీఎఫ్2 విషయంలో ఆయన మౌనం గాసిప్ రాయుళ్లు మాట్లాడుకునేలా చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కేజీఎఫ్ 2 చిత్రాన్ని మెచ్చుకోగా, మహేష్ మాత్రం సైలెంట్ గా ఉండడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి . మరి ఇప్పటికైనా మహేష్ స్పందిస్తారా.. అనేది చూడాలి.
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 సినిమాను రూపొందించారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ విజయవిహారం చేస్తోంది. హిందీ వెర్షన్ లో ఈ సినిమా రూ.250 కోట్ల మార్కును టచ్ చేసింది. చాలా వేగంగానే రూ.300 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా ఫుల్లుగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…