KGF Krishna Ji : కన్నడ సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ 2 ఇంటా, బయటా అదరగొడుతోంది. ఈ సినిమా రాబడుతున్న కలెక్షన్స్ చూసి విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దేశం మొత్తం కేజీఎఫ్ 2 గురించే మాట్లాడుకుంటున్నారు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరినీ, వారి నటననీ అభినందిస్తున్నారు ప్రేక్షకులు. హీరో, హీరో తల్లి, అధీరా పాత్ర, రమైకా సేన్ పాత్ర ఇలా సినిమాలోని ముఖ్య పాత్రలందర్నీ నెటిజన్లు, ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ముఖ్యమైన పాత్రలలో నటించిన వారి వివరాలను ప్రేక్షకులు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఈ సినిమాలో అంధుడిగా కనిపించిన తాత పేరు కృష్ణాజీ. ఆంధ్ర – కర్ణాటక సరిహద్దుకు చెందిన వారు. సినిమాలపై ఆసక్తితో చిన్ననాటి నుండే ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు చూస్తూ కృష్ణాజీ పెరిగారు. సినిమాల్లోకి రావలనుకున్న ఆయన శిక్షణ కూడా తీసుకున్నారు. కొంతకాలం సినిమా వాళ్లకు దుస్తులు కుట్టిన ఆయనకు భీమ్ వెంకటేష్ అనే హీరో కమ్ ప్రొడ్యూసర్ తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం అతని దగ్గర పని చేశారు. ఆ తర్వాత కమల్ హాసన్ మేకప్ బాయ్ తో పరిచయం ఏర్పడగా ఆయన వద్ద టచప్ బాయ్ గా పనిచేశాడు.
అనంతరం శంకర్ నాగ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. శంకర్ నాగ్ దగ్గర పనిచేస్తున్న సమయంలోనే కృష్ణాజీకి కేజీఎఫ్ లో నటించే అవకాశం వచ్చింది. ఛాన్స్ రావడం, పాత్రలో ఒదిగి పోవడం, ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందడం జరిగింది. ఈ కథలో అందరూ మెచ్చుకునే పాత్ర ఇంకొకటి ఉంది. అదే ఇనాయత్ ఖలీల్. కథని మలుపు తిప్పే ఈ పాత్రలో నటించింది మన టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నటుడి తండ్రి. తెలుగు నటుడు ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి బాలకృష్ణ నీలకంఠాపురం కేజీఎఫ్ 2లో ఇనాయత్ ఖలీల్ పాత్రలో నటించి అందర్నీ మెప్పించారు. ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ నటించకపోవడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…