Samantha Second Marriage : అక్కినేని నాగచైతన్య, సమంత ఎంతో కాలం క్యూట్ కపుల్‌గా ఉన్నారు. ఎప్పుడైతే సమంత తన పేరు నుంచి అక్కినేని అనే పేరును తొలగించిందో అప్పటి నుంచే అనుమానాలు మొదలయ్యాయి. తరువాత కొద్ది రోజులకే వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి ఆ అనుమానాలను నిజం చేశారు. దీంతో వీరి విడాకుల విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతటి క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు అసలు ఎందుకు విడిపోయారు ? వీరి విడాకులకు కారణాలు ఏమిటి ? అని ఫ్యాన్స్ తెగ ఆలోచించారు. కానీ ఇప్పటికీ వారు విడాకులు ఎందుకు తీసుకున్నారో సరైన కారణాలు తెలియదు. సమంత పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అందాలను ఆరబోయడమే వారి విడాకులకు కారణమని ఇప్పటికీ చాలా మంది భావిస్తున్నారు. అయితే విషయం ఎలా ఉన్నా ఇప్పుడు వారు విడిపోయారు కనుక వారు రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ? అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని.. అందుకు నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. పనిలో పనిగా అఖిల్‌కు కూడా ఒకేసారి పెళ్లి చేయాలని చూస్తున్నారని.. వార్తలు వచ్చాయి. అయితే నాగచైతన్య పీఆర్ టీమ్ ఈ వార్తలను ఖండించింది. అవన్నీ వట్టి పుకార్లేనని తేల్చేసింది. దీంతో నాగచైతన్య రెండో పెళ్లి విషయం వట్టిదే అని నిర్దారణ అయింది. అయితే ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది.. అంటూ వార్తలు వస్తున్నాయి. ఆమెను గత కొంత కాలం నుంచి రెండో పెళ్లి చేసుకోవాలని ఇంట్లోని కుటుంబ సభ్యులు పోరు పెడుతున్నారట. దీంతో ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం సమంత చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యేందుకు కనీసం ఇంకో ఏడాది లేదా ఏడాదిన్నర సమయం అయినా పడుతుంది. అప్పటి వరకు ఆగాక ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని సమంత ఇంట్లో చెప్పిందట. దీంతో ఈ వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నదే. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. దీనిపై సమంత లేదా ఆమె పీఆర్ టీమ్ ఏమైనా స్పందిస్తుందో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…