Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో స్టైలిష్ లుక్ లో వెండితెరపై కనబడుతూ ఎంతోమంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది.

Mahesh Babu : లక్ష్మీ నరసింహస్వామి రూపంలో..
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్, గోవా, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరిగింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఇంటర్వెల్ ముందు ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉందని.. అందులో మహేష్ బాబు ఇదివరకు ఎప్పుడూ కనిపించని లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం.
ఈ యాక్షన్ సన్నివేశంలో మహేష్ బాబు విలన్లకు ఏకంగా లక్ష్మీ నరసింహస్వామి రూపంలో కనిపించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.