Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్‌గా నటించిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ మే 12వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇందులో మహేష్ పక్కన కీర్తి సురేష్ జోడీగా నటించగా.. పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మహేష్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఆయన సొంత ప్రొడక్షన్ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అడివి శేష్ ప్రధాన పాత్రలో మేజర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను మహేష్ తాజాగా లాంచ్ చేశారు.
అయితే ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మహేష్‌ను బాలీవుడ్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలను మార్చి ప్రచురించారు. బాలీవుడ్ అంటే తనకు ఇష్టంలేదని.. తనను బాలీవుడ్ తట్టుకోలేదని.. తెలుగులోనే తనకు సౌకర్యంగా ఉందని.. మహేష్ అన్నట్లు కథలు అల్లారు. అయితే దీనిపై చాలా మంది మహేష్ బాబును విమర్శించారు. ముఖ్యంగా ఉత్తరాది వారు ఆయనను ట్రోల్ చేశారు. అయితే దీనిపై మహేష్ స్పందించారు.
తాను ఒకటి అంటే.. మీడియా దాన్ని ఇంకోలా అర్థం చేసుకుందని.. తాను బాలీవుడ్‌ను విమర్శించలేదని.. మహేష్ అన్నారు. తనకు తెలుగు సౌకర్యంగా ఉంటుందన్న విషయం చెప్పానని.. అయితే తాను తెలుగులో నటించే సినిమాలే హిందీలో రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. తెలుగు సినిమాలకు ప్రస్తుతం ప్రపంచ స్థాయి ఆదరణ ఉందని.. కనుక తెలుగులోనే స్ట్రెయిట్ సినిమా చేస్తానని.. ఇతర భాషల్లో రిలీజ్ అయితే సంతోషమే కదా.. అని అన్నారు. అంతేకానీ తాను బాలీవుడ్‌ను విమర్శించలేదని స్పష్టం చేశారు. ఇక మహేష్ తన తరువాత సినిమా త్రివిక్రమ్‌తో చేయనున్నారు. వచ్చే ఏడాది వరకు ఈ మూవీ పూర్తవుతుంది. ఆ తరువాత రాజమౌళితో కలిసి సినిమా చేస్తారు. ఆ మూవీ పాన్ ఇండియా లెవల్‌లో విడుదలవుతుంది. దీంతో మహేష్ కు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…