Bithiri Sathi : 100 గోలీల డైలాగ్ గురించి అడిగిన స‌త్తి.. చాలా సేపు న‌వ్విన మ‌హేష్ బాబు.. వైర‌ల్ వీడియో..!

Bithiri Sathi : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన లేటెస్ట్ చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఇందులో ఆయ‌న‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టించ‌గా. ప‌ర‌శురామ్ ఈ మూవీని తెర‌కెక్కించారు. ఈ మూవీ మే 12వ తేదీన భారీ ఎత్తున విడుద‌ల‌వుతోంది. దాదాపుగా 2 ఏళ్ల త‌రువాత వ‌స్తున్న మ‌హేష్ మూవీ కావ‌డంతో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా విడుద‌ల నేప‌థ్యంలో చిత్ర యూనిట్ శ‌ర‌వేగంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంది. అందులో భాగంగానే తాజాగా మ‌హేష్ బాబు.. బిత్తిరి స‌త్తికి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూ ఆద్యంతం న‌వ్వుల పువ్వులు పూయించింది. స‌త్తి వేసిన జోక్స్‌కు ఆయ‌న తెగ న‌వ్వేశారు.

Bithiri Sathi

మ‌హేష్ బాబు వ‌య‌స్సు ఎక్కువే. ఈ వ‌య‌స్సులోనూ ఆయ‌న యువ‌కుడిలా క‌నిపిస్తారు. ఇక ట్రైల‌ర్‌లోనూ ఇలాంటి డైలాగ్ నే ఆయ‌న చెప్పారు. దీంతో ఆయ‌న బ్యూటీ సీక్రెట్ ఏంటి.. అని స‌త్తి అడ‌గ్గా.. ఏమీ లేదు.. అంద‌రూ తిన్న‌ట్లుగానే తింటాను. కానీ శ‌రీరానికి అవ‌స‌రం అయినంత‌.. చాలా ప‌ద్ధ‌తిగా తింటాన‌ని మ‌హేష్ చెప్పారు. ఇక జిమ్ చేసి కండ‌లు పెంచుతారా.. అంటే అందుకు ఆయ‌న అవున‌ని బ‌దులిచ్చారు. ఇంట్లోనే జిమ్ ఉంద‌ని.. ట్రెయిన‌ర్ వ‌చ్చి చేయిస్తార‌ని మ‌హేష్ తెలిపారు.

ఇక ట్రైల‌ర్‌లో తాళాల గుత్తి ప‌ట్టుకుని ఉంటారు క‌దా.. అలా ఎందుకు చేశారు.. అని స‌త్తి అడ‌గ్గా.. అందుకు మ‌హేష్ బ‌దులిస్తూ.. అది సినిమా చూసి తెలుసుకోవాల‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే మూవీలో మొద‌టి భాగం అమెరికాలో రెండో భాగం వైజాగ్‌లో జ‌రుగుతుంద‌ని మ‌హేష్ తెలిపారు. ఇక కీర్తి సురేష్ మీకు స‌రిజోడిగా స‌రిపోయింద‌ని స‌త్తి కితాబిచ్చాడు. కాగా ట్రైల‌ర్‌లో చూపించిన 100 గోలీల డైలాగ్‌ను స‌త్తి మ‌హేష్ ఎదుట చెప్పాడు. దీంతో మ‌హేష్ చాలా సేపు పెద్ద‌గా న‌వ్వేశారు. ఆ డైలాగ్ సినిమాలో ఉంటుందా.. లేక బీప్ వేసి క‌ట్ చేశారా.. అని స‌త్తి అడ‌గ్గా.. అందుకు ఆయ‌న స‌మాధానం చెబుతూ.. ఆ డైలాగ్ ఉంటుంద‌ని.. దానికి బీప్ వేయ‌లేద‌ని చెప్పారు.

ఇక మే 12న సినిమా విడుద‌ల అవుతుంద‌ని.. ఆ రోజు అంద‌రికీ పండుగ రోజు అని.. సెల‌వు ఇస్తే బాగుంటుంది క‌దా.. అని స‌త్తి అడ‌గ్గా.. మ‌హేష్ న‌వ్వేశారు. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా మ‌హేష్ బాబుకు, చిత్ర యూనిట్‌కు స‌త్తి బెస్టాఫ్ ల‌క్ చెప్పాడు. ఇక మ‌హేష్‌తో స‌త్తి చేసిన ఈ ఇంట‌ర్వ్యూ తాలూకు వీడియో యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది. దీనికి నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. మ‌హేష్ బాబు చాలా రోజుల త‌రువాత ఇలా చాలా బాగా న‌వ్వార‌ని అంటున్నారు. ఇక ఈ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లోనూ వైర‌ల్ అవుతుండ‌గా.. యూట్యూబ్‌లో టాప్ 10 ట్రెండింగ్ వీడియోల‌లో నం.6 స్థానంలో ఉంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఈ వీడియోను ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM