Bithiri Sathi : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం.. సర్కారు వారి పాట. ఇందులో ఆయనకు జోడీగా కీర్తి సురేష్ నటించగా. పరశురామ్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ మే 12వ తేదీన భారీ ఎత్తున విడుదలవుతోంది. దాదాపుగా 2 ఏళ్ల తరువాత వస్తున్న మహేష్ మూవీ కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ శరవేగంగా ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగానే తాజాగా మహేష్ బాబు.. బిత్తిరి సత్తికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించింది. సత్తి వేసిన జోక్స్‌కు ఆయన తెగ నవ్వేశారు.

మహేష్ బాబు వయస్సు ఎక్కువే. ఈ వయస్సులోనూ ఆయన యువకుడిలా కనిపిస్తారు. ఇక ట్రైలర్‌లోనూ ఇలాంటి డైలాగ్ నే ఆయన చెప్పారు. దీంతో ఆయన బ్యూటీ సీక్రెట్ ఏంటి.. అని సత్తి అడగ్గా.. ఏమీ లేదు.. అందరూ తిన్నట్లుగానే తింటాను. కానీ శరీరానికి అవసరం అయినంత.. చాలా పద్ధతిగా తింటానని మహేష్ చెప్పారు. ఇక జిమ్ చేసి కండలు పెంచుతారా.. అంటే అందుకు ఆయన అవునని బదులిచ్చారు. ఇంట్లోనే జిమ్ ఉందని.. ట్రెయినర్ వచ్చి చేయిస్తారని మహేష్ తెలిపారు.
ఇక ట్రైలర్‌లో తాళాల గుత్తి పట్టుకుని ఉంటారు కదా.. అలా ఎందుకు చేశారు.. అని సత్తి అడగ్గా.. అందుకు మహేష్ బదులిస్తూ.. అది సినిమా చూసి తెలుసుకోవాలని అన్నారు. ఈ క్రమంలోనే మూవీలో మొదటి భాగం అమెరికాలో రెండో భాగం వైజాగ్‌లో జరుగుతుందని మహేష్ తెలిపారు. ఇక కీర్తి సురేష్ మీకు సరిజోడిగా సరిపోయిందని సత్తి కితాబిచ్చాడు. కాగా ట్రైలర్‌లో చూపించిన 100 గోలీల డైలాగ్‌ను సత్తి మహేష్ ఎదుట చెప్పాడు. దీంతో మహేష్ చాలా సేపు పెద్దగా నవ్వేశారు. ఆ డైలాగ్ సినిమాలో ఉంటుందా.. లేక బీప్ వేసి కట్ చేశారా.. అని సత్తి అడగ్గా.. అందుకు ఆయన సమాధానం చెబుతూ.. ఆ డైలాగ్ ఉంటుందని.. దానికి బీప్ వేయలేదని చెప్పారు.
ఇక మే 12న సినిమా విడుదల అవుతుందని.. ఆ రోజు అందరికీ పండుగ రోజు అని.. సెలవు ఇస్తే బాగుంటుంది కదా.. అని సత్తి అడగ్గా.. మహేష్ నవ్వేశారు. సినిమా విడుదల సందర్భంగా మహేష్ బాబుకు, చిత్ర యూనిట్‌కు సత్తి బెస్టాఫ్ లక్ చెప్పాడు. ఇక మహేష్‌తో సత్తి చేసిన ఈ ఇంటర్వ్యూ తాలూకు వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబు చాలా రోజుల తరువాత ఇలా చాలా బాగా నవ్వారని అంటున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతుండగా.. యూట్యూబ్‌లో టాప్ 10 ట్రెండింగ్ వీడియోలలో నం.6 స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే చాలా మంది ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.