Mahaan Movie : తమిళ స్టార్, చియాన్ విక్రమ్ సినిమా అంటే సహజంగానే చాలా మంది ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఆయన వైవిధ్య భరితమైన చిత్రాలను తీస్తారని పేరుంది. ఈ క్రమంలోనే ఆయన తన కుమారుడితో కలిసి నటించిన తాజా చిత్రం.. మహాన్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. అందులో విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్‌లు యాక్టింగ్‌ను ఇరగదీశారని చెప్పవచ్చు.

విక్రమ్, ధ్రువ్ విక్రమ్‌లు కలిసి నటించిన మహాన్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయగా.. అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో బాబీ సింహా, సిమ్రాన్‌లు ఇతర కీలకపాత్రలు పోషించారు.
ధ్రువ్ విక్రమ్ గతంలో తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. అందులో ధ్రువ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక తన తండ్రితో కలిసి మహాన్ చిత్రంలో నటించి అలరించాడు. ఈ మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. గతంలో ఆయన పిజ్జా, పేట వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించారు.