Alia Bhatt : రాజమౌళి దర్శకత్వంలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ తేజలు హీరోలుగా, ఆలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావల్సి ఉంది. కానీ అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల చేస్తారనుకున్నారు. కానీ వాయిదా పడింది. ఈ క్రమంలోనే కొత్త విడుదల తేదీని ఇటీవలే ప్రకటించారు. మార్చి 25న ఈ సినిమా విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇందులో రామ్ చరణ్ పక్కన నటించిన ఆలియా భట్ త్వరలో మరో మూవీలో ఎన్‌టీఆర్ సరసన నటించనుంది.

ఎన్టీఆర్ 30వ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ మూవీలో ఆలియా భట్ నటిస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఆలియా స్పందించింది. తనకు కొరటాల శివ కథ చెప్పారని, దీంతో మారుమాట్లాడకుండా వెంటనే ఒప్పుకున్నానని.. ఆయనతో కలసి పనిచేయాలని ఆసక్తిగా ఉందని.. ఆలియా భట్ వెల్లడించింది.
ఈ క్రమంలో ఎన్‌టీఆర్ తరువాతి చిత్రంలో ఆలియా నటిస్తుందని కన్‌ఫామ్ అయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన నటీనటులు, టెక్నిషియన్స్, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. మూవీ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఆలియా నటించిన గంగూభాయ్ కతియవాడి ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది.