Madhavi Latha : సన్నీ ప్రేక్షకుల ఓట్లతో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అతని ఆటతోపాటు చేసిన సందడితో విజేతగా నిలిచాడు సన్నీ. అయితే హౌజ్ లో ఉన్నప్పుడు ప్రేక్షకులని అభ్యర్ధించిన సన్నీ గెలిచాక వారిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫ్యాన్ పేజీలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వంక తలెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విన్నర్‌గా నిలిచిన సన్నీకి గర్వం తలకెక్కిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నటి మాధవీలత అగ్గి మీద గుగ్గిలమైంది. ‘సన్నీ కోసం సపోర్ట్ చేసిన ఫ్యాన్ పేజీలను వదిలేసి, రివ్యూయర్లను వదిలేసి, ఓట్లు వేయడానికి వాళ్లు పడ్డ కష్టాన్ని వదిలేసి, ఓట్లు వేయండని మొత్తుకునే వాళ్లను వదిలేసి బడా టీవీ ఛానళ్లకు, ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ ఛానళ్లకు అతడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు.
సన్నీ తప్పు చేస్తున్నాడు. కృతజ్ఞతాభావం లేనివాళ్లంటే నాకు చిరాకు. అతడి కోసం ఎంతమంది పీఆర్ (పర్సనల్ రిలేషన్‌షిప్ మేనేజర్)లా మారిపోయారు. వాళ్లకు థ్యాంక్స్ అని ఒక మాట చెప్తే అయిపోతుందా ? తన గురించి గొప్పగా చెప్పుకొచ్చిన యూట్యూబ్ రివ్యూయర్ల పేర్లయినా మెన్షన్ చేశాడా ? పోనీ తనకు తెలీకపోతే అతడి ఫ్రెండ్స్‌కి తెలీదా? కళ్లు నెత్తికెక్కాయా ? నీ పీఆర్ ఫ్రెండ్ కనిపిస్తే చెంప పగలగొడతాను. సాధారణ జనానికి విలువివ్వకపోతే అక్కడే ఆగిపోతావు గుర్తుంచుకో. నాకు కోపం వస్తే అదే మీడియాలో నిలబెట్టి కడిగేస్తా. నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను, తిక్కలేస్తే తాట తీసి ఆరేస్తా’ అని వార్నింగ్ ఇచ్చింది మాధవీలత.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…