Upasana : టాలీవుడ్‌లో హీరోల మధ్య ఎంత సాన్నిహిత్యం ఏర్పడిందో మనం చూస్తూనే ఉన్నాం. కుర్ర హీరోలతోపాటు సీనియర్ హీరోలు కూడా పలు సందర్భాలలో కలుస్తూ అభిమానులకి మంచి వినోదాన్ని పంచుతున్నారు. పలు ఈవెంట్స్‌లో వీరు సందడి చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ‘దుబాయ్ ఎక్స్‌పో 2020’లో భాగంగా దుబాయ్‌కి వెళ్లారు ఉపాసన, నమ్రత.
దుబాయ్‌లో వీరందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోగా, ఆ తర్వాత నమ్రత, ఆమె సోదరి శిల్పా, మనీశ్ మల్హోత్ర తదితరులకు ఉపాసన ప్రత్యేకంగా విందు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘ఇష్టమైన స్నేహితులతో రుచికరమైన భోజనం. నాకెంతో ఇష్టమైనవారితో దుబాయ్‌లో ఈ మధ్యాహ్నం సరదాగా గడిచింది. ఉపాసన.. అద్భుతమైన వంటకాలతో నీలా విందు ఎవ్వరూ ఇవ్వలేరు.
మనీశ్.. ఈ రోజు నిన్ను ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుకలే త్వరలో హైదరాబాద్‌లో మనందరం కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్’’ అని నమ్రత పోస్ట్ పెట్టింది. దీనికి స్పందించిన ఉపాసన.. ‘‘సమయం ఎంతో సరదాగా గడిచిపోయింది. అతి త్వరలోనే మనం మళ్లీ హైదరాబాద్‌లో ఇలాగే కలుసుకోవాలి’’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…