Maa : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఏమోగానీ.. ఈ అసోసియేషన్‌లో భారీగా కుదుపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలుపొందడంతో నాగబాబు ముందుగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మా సభ్యుల్లో ఉన్న సంకుచిత భావన, లోకల్, నాన్ లోకల్ అనే ఫీలింగ్ వల్లే రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు.
ఇక నాగబాబు అనంతరం ప్రకాష్ రాజ్ కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనను నాన్ లోకల్ అంటున్నారని, కనుక అలాగే ఉండదలిచానని, అందువల్లే మా మెంబర్‌షిప్‌కు రాజీనామా చేస్తున్నానని.. అయితే తెలుగు సినిమాల్లో మాత్రం నటిస్తానని ఆయన తెలిపారు. దీంతో మా లో ప్రకాష్ రాజ్ ప్యానెల్‌తోపాటు మెగా కుటుంబానికి చెందిన వారు విచారంలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీలో నిలబడి గెలిచిన శ్రీకాంత్‌తోపాటు ఇతర సభ్యులు కూడా రాజీనామా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగబాబు, ప్రకాష్ రాజ్ అండ్ కో. కలిసి ఓ కొత్త అసోసియేషన్‌ను పెడతారని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఓడిపోయినంత మాత్రాన ఈ విధంగా అందరూ వరుస పెట్టి రాజీనామాలు చేస్తారా ? ఇండస్ట్రీ పెద్దలు చూస్తూ ఊరుకుంటారా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి మా భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…