Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, రాఘవేంద్రరావుల మధ్య ఎంతో ప్రత్యేకమైన ఆత్మీయత ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించారు. వీరి కాంబినేషన్ కూడా ప్రేక్షకులకు ఎంతో స్పెషల్. కేవలం ప్రొఫెషనల్ గా మాత్రమే కాకుండా పర్సనల్ గా కూడా వీరిద్దరూ మంచి ఆత్మీయులు. రాఘవేంద్రరావుని చిరంజీవి.. బాబాయ్ అని పిలుస్తారట. అలాగే చిరంజీవి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా రాఘవేంద్రరావు వస్తారు. రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో తెరకెక్కిన పెళ్ళి సందD సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
ఆ వేదికపై రాఘవేంద్రరావుతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ.. ఓ స్వీట్ షాక్ లాంటి సర్ ప్రైజ్ ను అందించారని అన్నారు. ఇంతకీ ఆ సర్ ప్రైజ్ ఏంటంటే.. చిరంజీవి పైళ్ళైన కొత్తలో మేటు పాళెం నుండి చెన్నై వచ్చే ట్రైన్ లో మెగాస్టార్, ఆయన భార్య సురేఖ ఎక్కారట. ఆ ట్రైన్ లో వారి కోసం ఓ కూపేని రాఘవేంద్రరావు బుక్ చేశారట. వెళ్ళి చూశాక.. అదొక అద్భుతమైన శోభనం గదిలా డిజైన్ చేసి ఉంచారని చిరు అన్నారు.
అంతేకాకుండా అక్కడ పళ్ళు, పూలు కూడా డెకరేట్ చేశారని.. అలా చూసి షాకయ్యాం అని, వాటితో పాటు మరెన్నో మెమరీస్ ని రాఘవేంద్రరావు ఇచ్చారని అన్నారు. కెరీర్ స్టార్టింగ్ లో మోసగాడు అనే సినిమాలో ఓ చిన్న పాత్ర చేశారు చిరంజీవి. ఆ తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఎప్పటికైనా ఓ పూర్తి స్థాయి సినిమా తీయాలని అనుకున్నారట. ఆ కోరిక అడవి దొంగతో ఫుల్ ఫిల్ అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించారని, అదంతా రాఘవేంద్రరావు వల్లే.. ఆ అదృష్టం దక్కిందని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…