Bigg Boss 5 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ప్రతివారం హౌస్ మేట్స్ తో ఎంతో సరదాగా ముచ్చటిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఆదివారం నాగార్జున నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఎంతో అందంగా ముస్తాబై ప్రేక్షకులను, కంటెస్టెంట్ లను సందడి చేశారు.
నాగార్జున పలువురు హీరోయిన్లను స్టేజి పైకి ఆహ్వానించి అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారు. ఇక పోలీస్ గెటప్ లో హైపర్ ఆదిని స్టేజ్ పైకి ఆహ్వానించడంతో హైపర్ ఆది స్టేజ్ పై.. హౌస్ లో ఉన్న సభ్యుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే హౌస్ సభ్యులతో తనదైన శైలిలో మాట్లాడుతూ పంచ డైలాగ్ లు వేస్తూ అందరిని నవ్వించిన ఆది అందరికంటే ముందుగా నాగార్జునపై సెటైర్లు వేయడంతో అందుకు నాగార్జున కూడా స్వీట్ వార్నింగ్ ఇస్తూ తోలు ఊడుతుంది.. అంటూ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా వేదిక పైకి వచ్చిన హైపర్ ఆది.. నాగార్జున గారు మీ మీద మాకు ఒక కంప్లైంట్ వచ్చింది అంటూ మీరు 1989 అక్టోబర్ 5న ఒక చెయిన్ లాగారు.. అనే కంప్లైంట్ చేశారని.. నాగార్జునను అడగడంతో.. అవును లాగాను ఏంటని.. నాగార్జున సమాధానం చెప్పారు.
ఈ క్రమంలోనే నాగార్జున శివ సినిమాను గుర్తుచేస్తూ నేను లాగింది అమ్మాయి మెడలో చైన్ కాదు సైకిల్ చైన్ అంటూ సమాధానం చెప్పాడు. అవునా మీరు ఇంకా అమ్మాయి మెడలో చైన్ లాగారేమో అనుకున్నాను అంటూ తనదైన శైలిలో నవ్వించారు. ఈ క్రమంలోనే నేను కూడా ఒకరోజు శివ స్టైల్ లో చేంజ్ లాగుదామని చూశాను.. చైన్ రాకపోగా చేతిలో చర్మం వచ్చింది అంటూ ఆది మరొకసారి పంచ్ వేశాడు. అందుకు స్పందించిన నాగార్జున ఇంకొక్కసారి అలా చేయకు చర్మం ఊడుతుంది అంటూ.. హైపర్ ఆదికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…