MAA : గత కొద్ది రోజుల క్రితం వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మా అసోసియేషన్ లో పెద్ద ఎత్తున విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మంచు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఇక మా ఎన్నికలలో మంచు విష్ణు గెలవడంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మొత్తం రాజీనామా చేసి మంచు విష్ణుపై విమర్శలు కురిపించారు. కొన్ని రోజుల వరకు ఈ విషయం గురించి తీవ్ర స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ ప్రశాంత వాతావరణం ఏర్పడింది.
అయితే తాజా పరిణామాలను చూస్తుంటే మరోసారి మా అసోసియేషన్ లో వివాదాలు చోటు చేసుకునేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే కొత్త కార్యవర్గం వచ్చి నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ మా అసోసియేషన్ ఆఫీస్ తాళాలు మూసి ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు వారికి పెన్షన్, వ్యక్తిగత సమస్యల గురించి మా అసోసియేషన్ అధికారులకు తెలియజేయాలని అసోసియేషన్ ఆఫీసు వద్దకు వెళ్లినప్పటికీ తాళాలు వేసి కనిపించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మామూలుగా అయితే మా అసోసియేషన్ లో అందరూ వచ్చే పని చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీటింగులకు మాత్రమే అందరూ హాజరైనా సరిపోతుంది, కానీ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకు అసోసియేషన్ కార్యాలయం తాళాలు తెరవకపోవడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా మా అసోసియేషన్ గురించి వస్తున్న ఈ వార్తలపై పెద్ద ఎత్తున చర్చలు జరగడంతో మరోసారి వివాదం తలెత్తేలా ఉందని భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…