Nara Bhuvaneshwari : గత వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన భార్య నారా భువనేశ్వరిపై వైఎస్ఆర్‌సీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్తా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనంగా మారింది. ఇక కొందరు టీడీపీ అభిమానులు, నందమూరి హీరోలు ఈ విషయంపై స్పందించారు.
తాజాగా అసెంబ్లీ ఘటనపై చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో తన గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కొందరు తనని ఒక తల్లిగా, ఒక తోబుట్టువుగా భావించి తనకు మద్దతుగా నిలబడ్డారని.. ఇలా తనకు మద్దతుగా నిలబడిన వారందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తనను విలువలతో కూడిన క్రమశిక్షణతో పెంచారని ఇప్పటికీ తను అలాంటి విలువలనే పాటిస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలోనే విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి కానీ ఈ విధంగా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ వారి గౌరవాన్ని కించపరచకూడదు. నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు.. భువనేశ్వరి బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…