Liger Movie : రౌడీ హీరోగా పేరుగాంచిన విజయ్ దేవర కొండ.. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి చేస్తున్న చిత్రం.. లైగర్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. అలాగే అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఇందులో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. అయితే లైగర్ మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే చిత్రం నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ ఏడాది టాలీవుడ్‌లో విడుదలైన ఒక్క ఆర్ఆర్ఆర్ తప్ప ఏ చిత్రమూ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో లైగర్‌తోనైనా టాలీవుడ్‌కు కళ వస్తుందని అంటున్నారు. ఇక లైగర్ పై చిత్ర యూనిట్ కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే లైగర్ టీమ్‌కు తాజాగా పంచ్ పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఓ స్టోరీ అయితే లీకైంది. అది లైగర్ సినిమా కథనే అని అంటున్నారు. ఇక ఆ కథ ఏమిటి.. అన్న విషయానికి వస్తే..

ఈ మూవీలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించబోతున్న విషయం విదితమే. అయితే మైక్ టైసన్‌తో ఎప్పటికైనా సెల్ఫీ దిగాలన్నది అతని కలనట. ఈ క్రమంలోనే అతను లైగర్‌గా ప్రసిద్ధిగాంచుతాడు. అయితే చివరకు అతను టైసన్‌తోనే బాక్సింగ్ చేస్తాడు. అతన్ని అంతమొందిస్తాడు. తరువాత టైసన్ బాడీని ఒళ్లో పడుకోబెట్టుకుని అతనితో లైగర్ సెల్ఫీని తీసుకుంటాడట. దీంతో కథ ముగుస్తుంది.
అయితే గతంలో రవితేజ హీరోగా వచ్చిన అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి మూవీ కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కించారు. దీంతో అదే షేడ్స్‌తో లైగర్‌ను తీశారని అంటున్నారు. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మూవీ విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే. దీన్ని ఆగస్టు 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.