Lemon : ప్రస్తుత తరుణంలో రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ రేట్లు ఏవిధంగా పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే. సామాన్యులకు ఇంధన ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. దీంతో జేబుకు భారీగా చిల్లు పడుతోంది. అలాగే నిమ్మకాయల ధరలు కూడా మండిపోతున్నాయి. నిమ్మకాయలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర పలుకుతున్నాయి. దీంతో నిమ్మకాయకు ఈ వేసవిలో చాలా మంది ఇప్పటికే దూరం అయ్యారు. అయితే ఇదే విషయాన్ని అదునుగా చూసుకున్న ఆ మొబైల్ స్టోర్స్ యజమాని మాత్రం తమ సేల్స్‌ను పెంచుకునేందుకు వినూత్నమైన ఆలోచన చేశాడు. అదేమిటంటే..
వారణాసిలోని మొబి వరల్డ్ షాప్ వేసవి ఆఫర్లను ప్రకటించింది. తమ సేల్స్‌ను పెంచుకునేందుకు వారు వినూత్నమైన ఆలోచన చేసి దాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. తమ వద్ద రూ.10 వేలు.. అంతకన్నా ఎక్కువ ధర కలిగిన ఫోన్‌ను కొంటే లీటర్ పెట్రోల్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే మొబైల్ ఫోన్లకు సంబంధించిన యాక్ససరీలను కొనుగోలు చేస్తే 1 నుంచి 5 వరకు నిమ్మకాయలను కూడా ఉచితంగా అందిస్తున్నామని తెలియజేసింది.
అలా ఆ షాప్ వారు ఆఫర్‌ను ప్రకటించడంతో జనాలు అక్కడ గుమిగూడుతున్నారు. తమకు ఇప్పుడు రద్దీ ఎక్కువైందని ఆ షాప్ వారు తెలియజేశారు. ఏది ఏమైనా రోజురోజుకీ పెరుగుతున్న ఇంధన ధరలతోపాటు నిమ్మకాయల ధరలను కూడా ఆసరాగా చేసుకుని వారు ఇలా ఆఫర్‌ను ప్రకటించడంతో పెద్ద ఎత్తున వినియోగదారులు ఆ షాప్‌కు వెళ్లి ఫోన్లు, యాక్ససరీలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆ షాప్ వారు తమ ఐడియా పనిచేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…