Kajal Aggarwal : తల్లి అయిన త‌ర్వాత తొలిసారి స్పందించిన కాజ‌ల్‌.. పోస్ట్ వైర‌ల్..!

Kajal Aggarwal : క‌లువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ అగ‌ర్వాల్ మాతృత్వ‌పు ఆనంద క్ష‌ణాల‌ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ భామ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కాజల్ సోదరి నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇక ఇది ఇలా ఉండ‌గా తమ అభిమాన నటి కాజల్ కొడుకు ఎలా ఉన్నాడో, ఏం పేరు పెట్టబోతున్నారో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే నిషా త‌న సోద‌రి కుమారుడికి నీల్ అనే పేరు పెట్టిన‌ట్టు తెలిపింది. ఇక కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని 2020 అక్టోబర్‌లో పెళ్లాడింది. అయితే ఈ దంపతుల‌కి కుమారుడు పుట్ట‌డంతో తెగ సంతోషంలో ఉన్నారు.

Kajal Aggarwal

అయితే కొడుకు పుట్టిన త‌ర్వాత కాజ‌ల్ తొలిసారిగా స్పందించింది. బేబీ నీల్‌ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది. నా బిడ్డను తెల్లటి వస్త్రంలో చుట్టుకుని దగ్గరకు హత్తుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేను. ఆ క్షణాల్లో నేను ఎదుర్కొన్న అనుభూతి నాకు అద్భుతమైన తల్లి ప్రేమను అర్థమయ్యేలా చేసింది. బిడ్డ పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో గుర్తు చేసింది. ఏదీ అంత ఈజీగా జ‌ర‌గ‌లేదు. మూడు నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, సాగిన చర్మం, గడ్డకట్టిన ప్యాడ్‌లు, బ్రెస్ట్‌ పంప్స్‌, ఒత్తిడి, ఆందోళనతో సతమతమయ్యాను. కానీ ఎప్పుడైతే బుజ్జి పాపాయిని ఎత్తుకున్నానో అప్పుడు అవన్నీ మ‌రచిపోయాను.

బిడ్డ కళ్లలోకి ప్రేమగా చూడటం, హత్తుకోవడం చేస్తూ కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకుంటున్నానని తెలిపింది. అద్భుతమైన ఈ ప్రయాణాన్ని ఆనందంగా సాగిస్తున్నామని చెప్పింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు కానీ.. అందంగా మాత్రం ఉంటారని తెలిపింది. కాజ‌ల్ పోస్ట్‌కి ప‌లువురు సెల‌బ్రిటీలతోపాటు నెటిజ‌న్స్ సైతం కామెంట్స్, లైక్‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా.. కాజ‌ల్ న‌టించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM