Latha Sri : అప్పట్లో ఆలీ హీరోగా.. ఎస్‌వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో కైకాల సత్యనారాయణ యముడిగా, బ్రహ్మానందం చిత్ర గుప్తుడిగా నటించి అలరించారు. అలాగే ఇంద్రజ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అయితే ఇందులో యమున్ని బురిడీ కొట్టించడం కోసం ఆలీ ఒక యువతిని రంగంలోకి దింపుతాడు. ఆ యువతి గుర్తుంది కదా.. లతాశ్రీ. అవును.. ఆమె ఈ మూవీలో ప్రత్యేక సాంగ్ కూడా చేసింది. అభివందనం.. అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక లతాశ్రీ 70కి పైగా చిత్రాల్లో నటించింది. అనేక సినిమాల్లో ఈమె అప్పటి హీరోలకు చెల్లెలి పాత్రలో కనిపించి అలరించింది. అయితే 1999 తరువాత ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఈ క్రమంలోనే ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అయితే హీరో నాగశౌర్య మీ మేనల్లుడా అని అడగ్గా.. అందుకు ఆమె అతని గురించి చెప్పేందుకు ఇష్టపడలేదు. తాను ఒక అన్నయ్య ఉండేవాళ్లం అని మాత్రం చెప్పింది. ఇక నాగశౌర్య తన మేనల్లుడని ఆమె చెప్పకనే చెప్పింది. అతని సినిమాలను చూస్తారా.. అని అడిగితే అందరి మూవీలను చూసినట్లే అతని మూవీలను కూడా చూస్తానని.. ప్రత్యేకంగా ఏమీ భావించనని స్పష్టం చేసింది.

కాగా నాగశౌర్య కుటుంబంతో ఎందుకు విభేదాలు వచ్చాయి.. వారితో మాట్లాడడం లేదా.. అని అడగ్గా.. అవన్నీ ఇప్పుడెందుకు.. టాపిక్ మార్చండి.. నేను చెబితే దాన్ని మీరు మరో రకంగా రాస్తారు. ఇప్పుడవన్నీ ఎందుకు.. నేను నేనులా జీవించాలనుకుంటున్నా.. వారి పేరును వాడుకోవడం ఇష్టం లేదు.. అని లతాశ్రీ సమాధానం చెప్పింది. ఈక్రమంలోనే ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.