Rashmi Gautam : బుల్లితెరపై సక్సెస్ ఫుల్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో.. యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు. ఈమె జబర్దస్త్ వేదికపై సందడి చేస్తుంటుంది. ఇతర షోలలో పెద్దగా ఆఫర్లు లేవు.. అలాగే సినిమాల్లో చాన్సులు కూడా రావడం లేదు. కానీ జబర్దస్త్ లో మాత్రం ఎంతోకాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. ఇక రష్మిగౌతమ్ మూగజీవాలపై ప్రేమను కురిపిస్తుంటుంది. గతంలో కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈమె వీధి కుక్కలకు ఆహారం పెట్టి గొప్ప మనసు చాటుకుంది. కాగా తాజాగా రష్మి గౌతమ్ సోషల్ మీడియా వేదికగా కుక్కలను పెంచుకుంటున్న కొందరిపై మండిపడింది. ఆమె వరుస పోస్ట్‌లు పెట్టింది.
మూగ జీవాలపై ప్రేమను కురిపించాలని రష్మి గౌతమ్ తెలిపింది. మీరు ఒక పెట్‌ను పెంచుకుంటున్నారు అంటే మీకు ఆర్థిక స్థోమత ఉన్నట్లేగా.. అలాంటప్పుడు వాటికి ఆహారం పెట్టకుండా హింసించడం ఎందుకు.. మీరు ఇలా చేస్తే రేప్పొద్దున మీ పిల్లలు కూడా మీకు ఆహారం పెట్టరు. ఎందుకంటే మూగజీవాల పట్ల మీరు చేసే దాన్ని వారు చూసి నేర్చుకుంటారు. కనుక వారు మిమ్మల్ని నిరాదరణకు గురి చేస్తారు. కనుక మూగ జీవాల పట్ల దయ చూపించండి. వాటిని హింసించకండి.. అంటూ రష్మి గౌతమ్ వరుసగా పోస్ట్‌లు పెట్టింది.

అలాగే ఈ మధ్య వరదల్లో చిక్కుకుపోయిన ఓ మావటిని ఓ ఏనుగు సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. అయితే తన ప్రాణాలను కాపాడిన ఏనుగును కూడా ఆ మావటి కర్రతో హింసించాడని.. రష్మి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా వరుస పోస్ట్‌లు పెట్టి ఫైర్ అయిన రష్మి తరువాత సారీ చెప్పింది. తాను కోపం, బాధతో ఈ పోస్టులు పెట్టానని.. అర్థం చేసుకోవాలని.. మూగ జీవాలను హింసించవద్దని మరోసారి కోరింది. ఈ క్రమంలోనే ఆమె పెట్టిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.