Pavitra Lokesh : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు పవిత్ర లోకేష్‌లు పెళ్లి చేసుకున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే. నరేష్ నటిస్తున్న అన్ని సినిమాల్లోనూ ఆమె కూడా యాక్ట్ చేస్తుండడం, ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తుండడంతోపాటు మహాబలేశ్వరంలో కలసి పూజలు చేయించడం.. వంటివన్నీ వీరి వివాహ వార్తలకు బలం చేకూర్చాయి. అయితే నరేష్ మాత్రం ఆమెతో పెళ్లి కాలేదని అన్నారు. ఇప్పటికే మూడు పెళ్లళ్లు చేసుకున్న తనకు అసలు వివాహం అంటేనే బోర్ కొట్టిందని.. వివాహ వ్యవస్థపై అసంతృప్తి కలుగుతుందని సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఆయన ఇలా వ్యాఖ్యలు చేసినప్పటికీ పవిత్ర లోకేష్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఉంటారనే అనుకుంటున్నారు.
ఇక పెళ్లి వ్యవస్థపై నమ్మకం పోయిందన్న నరేష్ మాటలకు కొందరు వేరే అర్థాలు తీస్తున్నారు. ఆయన పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తున్నారని.. అందుకనే పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేశారని అంటున్నారు. కనుక ఆయన పెళ్లి చేసుకోరని.. ఆ విషయం డౌట్‌గానే ఉందని.. అయితే సహజీవనం మాత్రమే చేస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇంకో పెళ్లి అంటే బోర్ కొట్టి ఉండవచ్చు. కనుకనే పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తున్నారనే వార్తలకు బలం చేకూరినట్లు కూడా అవుతోంది.
ఇక వీరిద్దరూ కలసి సుమారుగా 10కి పైగానే చిత్రాల్లో నటించారు. షూటింగ్ సమయంలోనే నరేష్ వ్యక్తిత్వం నచ్చి ఆమె ఇష్ట పడిందని.. ఇది వారిద్దిరి మధ్య ప్రేమను కలిగేలా చేసిందని అంటున్నారు. ఇక పవిత్ర లోకేష్‌కు కూడా రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకున్న ఈమె తరువాత టీవీ యాక్టర్ సుచేంద్ర ప్రసాద్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆయనతో వచ్చిన మనస్ఫర్థల కారణంగానే ఆమె భర్తకు దూరంగా ఉంటుందని.. కానీ విడాకులు మాత్రం ఇంకా తీసుకోలేదని అంటున్నారు. మరి భవిష్యత్తులో అయినా నరేష్, పవిత్రలు పెళ్లి చేసుకుంటారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…