Trolls On Dil Raju : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఏది చేసినా నెటిజన్లు ట్రోలింగ్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. ట్రోల్స్ బారిన పడి కొందరు సెలబ్రిటీలు టెంపరరీగా సోషల్ ఖాతాలను డీయాక్టివేట్ కూడా చేస్తున్నారు. గతంలో కొందరు సెలబ్రిటీలకు ఇలాగే జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా దిల్ రాజు అనవసరంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఆయన భార్య తేజస్విని అలియాస్ వైఘా రెడ్డి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం విదితమే. జూన్ 29న రాత్రి ఆమె ప్రసవించింది. దీంతో నిర్మాత దిల్ రాజుకు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఎప్పుడు మ్యాటర్ దొరుకుతుందా.. ఎప్పుడు ఎవరిని ట్రోల్ చేద్దామా.. అని ఎదురు చూస్తున్న వాళ్లకు దిల్ రాజు తండ్రి అయ్యాడన్న వార్త చెవుల్లో అమృతంలా మారింది. దీంతో వారు రెచ్చిపోతున్నారు. దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు.
దిల్ రాజుకు ఇప్పటికే ఓ కుమార్తె ఉన్న విషయం విదితమే. ఆమె మొదటి భార్య సంతానం. ఆమెకు ఇప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. అంటే దిల్ రాజు ఆల్రెడీ తాత అయ్యారన్నమాట. ఇదే విషయాన్ని చెబుతూ కొందరు నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. దిల్ రాజు తాతగా ఉన్నారు.. అలాంటిది ఇప్పుడు ఆయనకు ఇదంతా అవసరమా.. ఎందుకు ఇలా చేస్తున్నారు.. అని కొందరు నెటిజన్లు అంటుండగా.. ఇంకొందరు మాత్రం ఎవరైనా సరే తండ్రి అయ్యాక తాత అవుతారు. కానీ దిల్ రాజు మాత్రం వెరైటీగా తాత అయ్యాక తండ్రి అయ్యారు.. అంటూ విమర్శిస్తున్నారు.
అయితే కొందరు మాత్రం దిల్ రాజుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన వివాహం ఆయన ఇష్టం. ఆయన వ్యక్తిగత విషయాల్లో మన జోక్యం చేసుకోవడం ఎందుకు.. మనిషి అన్నాక తోడు అవసరం.. అందుకు వయస్సుతో పనిలేదు.. అందుకనే ఆయన మళ్లీ పెళ్లి చేసుకున్నారు.. ఇంకా ఓపిక ఉంది కాబట్టే బిడ్డను కన్నారు.. ఇందులో ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది.. అంటూ మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…