Anasuya : రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్‌తో అనసూయ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతకు ముందు ఈమె సినిమాలలో చేసినా ఈ మూవీనే ఆమెకు ఎక్కువ పేరు తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే అనసూయ అప్పటి నుంచి వరుస సినిమాల్లో ఆఫర్లను అందుకుంటూ తన సత్తా చాటుతూ వస్తోంది. ఇక పుష్ప సినిమాలో అయితే దాక్షాయణి పాత్రలో నెగెటివ్ షేడ్స్‌తో నటించి షాకిచ్చింది. అనసూయ పాత్ర నిడివి తక్కువే అయినా సినిమాలో కీలకంగా ఉంటుంది. ఈ క్రమంలోనే దాక్షాయణిగా అనసూయ చేసిన రచ్చ మామూలుగా లేదు.
ఇక అనసూయ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. తన కెరీర్‌లో తాను కీలకమైన నిర్ణయం తీసుకున్నానని.. ఎన్నో జ్ఞాపకాలతో వెళ్తున్నానని.. బాధగా ఉన్నా తప్పడం లేదని.. ఇకపై కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నానని తెలిపింది. దీంతో ఈమె జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పిందని.. కనుకనే ఆ పోస్ట్ పెట్టి ఉంటుందని అంటున్నారు. అయితే అనసూయ ఇటీవలే ఓ ప్రత్యేక కార్యక్రమంలో మెరిసింది. అందులో డ్యాన్స్ చేసి అలరించింది.
స్టార్ మా చానల్‌లో ప్రసారం అవుతున్న పార్టీ చేద్దాం పుష్ప షో లో అనసూయ పాల్గొని డ్యాన్స్ చేసింది. అందులో గ్లామరస్ డ్రెస్ ధరించి అనసూయ చేసిన డ్యాన్స్‌కు యువత ఫిదా అవుతున్నారు. ఆమె డ్యాన్స్ స్టెప్స్‌కు మైమరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ తాలూకు వీడియో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. త్వరలోనే ప్రారంభం కానున్న పుష్ప 2తోపాటు కృష్ణవంశీ రంగమార్తాండ, దర్జా అనే మూవీల్లో నటిస్తోంది. ఇవి త్వరలో రిలీజ్ కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…