Lal Singh Chaddha : ఒక సినిమా తీయడానికి కొన్ని వందల మంది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో రోజులు శ్రమిస్తారు. కానీ కొంతమంది అత్యుత్సాహం వల్ల వారి కష్టం అంతా వృథాగా పోయి వారికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోంది. అమీర్ ఖాన్ హీరోగా, కరీనా కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా తాజాగా విడుదలైంది. ఈ సినిమాను అమెరికాలో సూపర్ హిట్ గా నిలిచిన ఫారెస్ట్ గంప్ అనే సినిమాకి రీమేక్‌గా తెరకెక్కించారు. ఫారెస్ట్ గంప్‌కి అనేక ఆస్కార్ అవార్డులు రావడంతో ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.
దానికి తగినట్లుగా అదే సినిమాని లాల్ సింగ్ చడ్డాగా తెరకెక్కించారు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండడంతో ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసింది. అయితే ఈ సినిమా థియేటర్ లో విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. లాల్ సింగ్ చడ్డా విడుదలైన మొదటి రోజునే హెచ్‌డీ క్వాలిటీతో తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సైట్లలో లీక్ కావడంతో మూవీ మేకర్స్ ని, నటీనటులను షాక్‌కు గురి చేసింది.
లాల్ సింగ్ చడ్డాను తమిళ రాకర్స్, టెలిగ్రామ్, మూవీ రూల్జ్ తో సహా ఇతర పైరసీ ఆధారిత వెబ్‌సైట్‌లలో లీక్ చేశారు. దురదృష్టవశాత్తూ సినిమా లీక్ కావడంతో బాక్సాఫీస్ కలెక్షన్ పై ప్రభావం పడవచ్చు. అయితే.. సినిమా విడుదలైన మొదటి రోజు లీక్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు సీతారామం, బింబిసార, శభాష్ మిథు, షంషేరా, విక్రాంత్ రోనా, మేజర్, ఎఫ్ 3, స్ట్రేంజర్ థింగ్స్ 4, ఆచార్య, రాధేశ్యామ్, బంగార్రాజు, ధాకడ్, భూల్ 2 రూపాయ్ వంటి అనేక చిత్రాలు ఆయా సైట్లలో తొలి రోజే లీకయ్యాయి.
ఇక ఈ టాప్ పైరసీ సైట్లపై ప్రభుత్వం అనేక సార్లు కఠిన చర్యలు తీసుకుంది. గతంలో అనేక సార్లు తమిళ్ రాకర్స్ సైట్ ను బ్లాక్ చేశారు. అయినప్పటికీ ప్రతిసారి వారు కొత్త డొమైన్ తో వస్తున్నారు. తమిళరాకర్స్ సైట్ థియేటర్లలో విడుదలైన సినిమాలను లీక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పైరసీ అనేది 1957 కాపీరైట్ చట్టం ప్రకారం నేరం. ఏ రూపంలోనైనా పైరసీలో పాల్గొనడం లేదా ప్రోత్సహించడం మానుకోవాలని మేకర్స్ చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…