Viral Video : రోడ్డుపై మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదాలు ఊహించని విధంగా జరుగుతూనే ఉంటాయి. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఓ వ్యక్తి.. రోడ్డు మీద తన బైక్ ని రివర్స్ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో వెనక్కి చూసుకోకపోవడం వల్ల పెద్ద గుంతలో పడిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఈ మధ్యకాలంలో పడిన భారీ వర్షాలకు రోడ్లు దారుణంగా మారిపోయాయి. ఏ రోడ్డుపై ఎక్కడ గుంత ఉంటుందో మనం చెప్పలేం. మనమే.. ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం ముందుకు వెళ్తున్నా.. వెనక్కి తీస్తున్నా.. రోడ్డు ఎలా ఉంటుందో చూసుకోవాలి. లేకపోతే.. ఇలాగే అవుతుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ వీడియో.. వాహనదారులను విపరీతంగా భయపెడుతోంది.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను వై మెన్ లివ్ లెస్ అనే పేజీలో ట్వీట్ చేశారు. మోటారు సైకిల్ నడుపుతున్న వ్యక్తిని వీడియోలో చూడవచ్చు. ఓ దుకాణం ముందు నిలబడి తన వాహనాన్ని రివర్స్ చేస్తున్నాడు. అతని వెనుక ఉన్న గుంతను అతను చూసుకోలేదు. నేరుగా వెళ్లి అతను భారీ గుంతలో పడిపోయాడు. జర్నీ ఆఫ్ ది ఎర్త్ అని వ్యంగ్యంగా క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు.
ఈ వీడియోకి ఇప్పటి వరకు 1.30 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మరికొందరు ఆ వీడియో చూసి నవ్వుకుంటున్నారు. దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. అసలు అతను మరో విశ్వంలోకి వెళ్తున్నాడు, అందుకే వెనక్కు వెళ్తున్నాడు.. అంటే.. మరో ట్విట్టర్ యూజర్ దీనిపై కామెంట్ చేస్తూ.. నిగూఢ పరిస్థితుల్లో అదృశ్యమయ్యాడు.. అని కామెంట్ చేశాడు. ఇక ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…