Viral Video : వారెవ్వా.. రాను రాను సాంగ్‌కు ఏం డ్యాన్స్ చేసింది.. వీడియో..!

Viral Video : బాహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి వరుస పాన్ ఇండియా చిత్రాలతో దక్షిణాది ఇండస్ట్రీ దేశవ్యాప్తంగా సక్సస్ సాధించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నార్త్ ఇండియా థియేటర్ ఓనర్స్ మన టాలీవుడ్ సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతాయా అని ఎదురు చూస్తూన్నారు. అంతేకాకుండా మన చిత్రాలకు నార్త్ ఇండియాలో సైతం అభిమానులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియాకు సౌత్ ఫీవర్ పట్టుకుందని తెలుస్తోంది.

మన టాలీవుడ్ సినిమాల‌లోని నటులు, పాటలపై రోజురోజుకూ ఇష్టం పెంచుకుంటూ అభిమానులుగా మారిపోతున్నారు. మునుపటి రోజుల్లో మన దక్షిణాది నటులను ఉత్తరాది వారు ఎంతో చిన్న చూపు చూసేవారు. మన నటులు నల్లగా ఉంటారని, ఇంగ్లిష్ కూడా సరిగ్గా మాట్లాడటం రాదంటూ హేళన చేసేవారు. ఇదే విషయంపై మన టాలీవుడ్ ప్రముఖులు ఉత్తరాది నటులు చేసే వివక్షకు ఎన్నో సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివక్షలో మొదటగా గుర్తుకు వచ్చేది మన హీరో సిద్ధార్థ్.

Viral Video

ఒకప్పుడు కపూర్, ఖాన్ ల హయాంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నడిచేది. వీరు దక్షిణాది వారికి సినిమాలు తీయడం రాదని, బాలీవుడ్ వారిలా  కోట్ల రూపాయలు టర్నోవర్  సంపాదించలేరు అంటూ మన దక్షిణాది నటులను హేళన చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. మన హీరోలకు, వారు చేసే చిత్రాలకు క్రేజ్ పెరిగింది. అప్పట్లో ఉత్తరాది ప్రేక్షకులు సల్మాన్, షారుక్, అమీర్ అంటూ జపం చేసేవారు. ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ క్రేజ్ లో పడిపోయారు.

సామాన్యులు కాకుండా సెలబ్రిటీలు సైతం మన హీరోలకు అభిమానులుగా మారిపోయారు. సారా అలీఖాన్, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ నటీమణులు సైతం విజయ్ దేవరకొండ క్ర‌ష్ లో పడిపోయారు. నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రంలో రాను రానంటూనే చిన్నదో పాట‌ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ పాటకు సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు.

మొన్నకు మొన్న మన టీమిండియా బౌల‌ర్‌ యుజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ కూడా ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియా ను షేక్ చేసింది. ఇప్పుడు తాజాగా నార్త్ ఇండియన్ అమ్మాయిలు కూడా  రాను రానంటూనే చిన్నదో పాటకు మాస్ స్టెప్పులతో డాన్సుల‌ను ఇరగదీస్తున్నారు. ఒక విధంగా ఇది మన సౌత్ సినిమాలకు ప్లస్ అని చెప్పవచ్చు. వీరి వీడియోల ద్వారా మన సినిమాలను ప్రమోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM