Viral Video : బాహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి వరుస పాన్ ఇండియా చిత్రాలతో దక్షిణాది ఇండస్ట్రీ దేశవ్యాప్తంగా సక్సస్ సాధించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నార్త్ ఇండియా థియేటర్ ఓనర్స్ మన టాలీవుడ్ సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతాయా అని ఎదురు చూస్తూన్నారు. అంతేకాకుండా మన చిత్రాలకు నార్త్ ఇండియాలో సైతం అభిమానులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియాకు సౌత్ ఫీవర్ పట్టుకుందని తెలుస్తోంది.
మన టాలీవుడ్ సినిమాలలోని నటులు, పాటలపై రోజురోజుకూ ఇష్టం పెంచుకుంటూ అభిమానులుగా మారిపోతున్నారు. మునుపటి రోజుల్లో మన దక్షిణాది నటులను ఉత్తరాది వారు ఎంతో చిన్న చూపు చూసేవారు. మన నటులు నల్లగా ఉంటారని, ఇంగ్లిష్ కూడా సరిగ్గా మాట్లాడటం రాదంటూ హేళన చేసేవారు. ఇదే విషయంపై మన టాలీవుడ్ ప్రముఖులు ఉత్తరాది నటులు చేసే వివక్షకు ఎన్నో సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివక్షలో మొదటగా గుర్తుకు వచ్చేది మన హీరో సిద్ధార్థ్.

ఒకప్పుడు కపూర్, ఖాన్ ల హయాంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నడిచేది. వీరు దక్షిణాది వారికి సినిమాలు తీయడం రాదని, బాలీవుడ్ వారిలా కోట్ల రూపాయలు టర్నోవర్ సంపాదించలేరు అంటూ మన దక్షిణాది నటులను హేళన చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. మన హీరోలకు, వారు చేసే చిత్రాలకు క్రేజ్ పెరిగింది. అప్పట్లో ఉత్తరాది ప్రేక్షకులు సల్మాన్, షారుక్, అమీర్ అంటూ జపం చేసేవారు. ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ క్రేజ్ లో పడిపోయారు.
సామాన్యులు కాకుండా సెలబ్రిటీలు సైతం మన హీరోలకు అభిమానులుగా మారిపోయారు. సారా అలీఖాన్, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ నటీమణులు సైతం విజయ్ దేవరకొండ క్రష్ లో పడిపోయారు. నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రంలో రాను రానంటూనే చిన్నదో పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ పాటకు సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు.
మొన్నకు మొన్న మన టీమిండియా బౌలర్ యుజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ కూడా ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియా ను షేక్ చేసింది. ఇప్పుడు తాజాగా నార్త్ ఇండియన్ అమ్మాయిలు కూడా రాను రానంటూనే చిన్నదో పాటకు మాస్ స్టెప్పులతో డాన్సులను ఇరగదీస్తున్నారు. ఒక విధంగా ఇది మన సౌత్ సినిమాలకు ప్లస్ అని చెప్పవచ్చు. వీరి వీడియోల ద్వారా మన సినిమాలను ప్రమోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
View this post on Instagram