Krithi Shetty : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి జోరు మీదుంది. వరుస సినిమాలను ఓకే చేస్తూ.. శరవేగంగా సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్తోంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే హిట్‌ను సాధించింది. తరువాత చేసిన రెండు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. దీంతో ఈమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తున్న ఈమెకు కోలీవుడ్ లోనూ వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
బాల దర్శకత్వంలో నటుడు సూర్య ఓ మూవీని చేస్తున్న విషయం విదితమే. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టిని ఎంపిక చేశారు. ఇక తమిళ స్టార్ హీరో ధనుష్ పక్కన కూడా ఈమె నటించే అవకాశాన్ని కొట్టేసినట్లు తెలుస్తోంది. ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ మూవీని చేస్తున్నారు. దీని తరువాత ధనుష్ ఇంకో దర్శకుడితో మరో మూవీని చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందులో కృతికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఇంకో తమిళ మూవీలో నటించేందుకు కూడా కృతికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ దాన్ని ఆమె ఇంకా ఓకే చేయలేదట.
అయితే తమిళంలో ఇంకో రెండు సినిమాలను వరుసగా ఓకే చేస్తే.. అప్పుడు తెలుగు, తమిళంలో వేర్వేరుగా హ్యాట్రిక్ మూవీలు చేసినట్లు అవుతుంది. ఇలా కృతిశెట్టి తెలుగు, తమిళంలలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఆరంభంలోనే ఈమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈమె కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. ఇక రామ్ సరసన ది వారియర్ అనే మూవీలో నటిస్తున్న ఈమె తన డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ఆకట్టుకుంటుండగా.. వీటిలో బుల్లెట్ సాంగ్ బాగా ట్రెండింగ్‌లో ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…