Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. తెలుగులోనూ ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఈ మధ్యే బిగ్ బాస్ నాన్‌స్టాప్ పేరిట బిగ్ బాస్ ఓటీటీ షోను నిర్వహించారు. కానీ దీనికి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. అయితే ఎట్టకేలకు రెగ్యులర్ బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. ఈ మేరకు నిర్వాహకులు బిగ్ బాస్ 6 తెలుగు ప్రోమోను లాంచ్ చేశారు. ఇందులో నాగార్జున కనిపించి షాకిచ్చారు. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ 6 తెలుగు ప్రారంభం అవుతుందని కన్‌ఫామ్ చేశారు. ఇక ప్రోమోలో లోగోను సైతం లాంచ్ చేశారు.
అయితే బిగ్‌బాస్ ఓటీటీలో ఎంపికైన టాప్ 5 మంది బిగ్ బాస్ 6 తెలుగుకు నేరుగా అర్హత సాధిస్తారని గతంలోనే ప్రకటించారు. కనుక 14 మందిలో 5 మంది పేర్లు ఇప్పటికే కన్‌ఫామ్ అయ్యాయి. అయితే దీనిపై అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఇక మిగిలిన 9 మందిలో ఒక కామన్ మ్యాన్ పోను మరో 8 మందిని కొత్తగా ఈ సీజన్‌కు కంటెస్టెంట్లుగా తీసుకుంటారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఓ లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఈసారి బిగ్ బాస్ సీజన్‌లో.. సంజనా చౌదరి, ఆశా సైనీ, యూట్యూబర్ కుషిత కల్లపు, యాంకర్ మంజూష, సింగర్ మోహన భోగరాజు, జబర్దస్త్ వర్ష, యాంకర్లు మంజూష, రోషన్, కొరియోగ్రాఫర్ పొప్పి మాస్టర్, సీరియల్ నటి కరుణ భూషన్, వలయం మూవీ ఫేమ్ లక్ష్య్ చదలవాడ, సీరియల్ నటుడు కౌశిక్, యాక్టర్ శ్రీహాన్, మిడిల్ క్లాస్ మెలొడీస్ ఫేమ్ చైతన్య గరికపాటిలు..పాల్గొంటారని తెలుస్తోంది. అయితే షో ప్రారంభం అయ్యే వరకు ఈ వివరాలపై ఎలాగూ సస్పెన్స్ నెలకొనే ఉంటుంది. కానీ అప్పటి వరకు ఏదో ఒక విధంగా లిస్ట్ అయితే లీక్ అవుతుంది. కనుక అప్పటి వరకు ఈ వివరాల కోసం వేచి చూడక తప్పదు.
ఇక ఈ సారి సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్ట్‌గా ఉంటారని ప్రోమో ద్వారా తేలిపోయింది. ఈ మధ్యే ఈ సీజన్‌కు సమంతను హోస్ట్‌గా ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. కానీ ప్రోమో ద్వారా ఆ వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. ఈ సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక బిగ్ బాస్ 3వ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్‌గా ఈ షోకు వస్తుండగా.. మొన్నీ మధ్యే ముగిసిన ఓటీటీ షోకు కూడా ఈయనే హోస్ట్‌గా ఉన్నారు. అయితే ఈసారి నాగార్జునను మారుస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయితే ఈసారి మాత్రం అన్ని హంగులతో గత సీజన్‌కు భిన్నంగా షోను నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. కాగా బిగ్ బాస్ 6 తెలుగు ప్రారంభ తేదీపై త్వరలోనే వివరాలను ప్రకటించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…